Banjara Hills Road Accident: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నం.3లో ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైన నిందితులకు పోలీసులు రక్త పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే వాళ్లు మద్యం సేవించారా? లేదా? అనే విషయంపై క్లారిటీ వస్తుందని అధికారులు చెప్తున్నారు. ఈ ప్రమాదంలో నిందితులు ప్రణవ్, వర్ధన్ రావు స్వల్ప గాయాలతో బయటపడ్డారని వెల్లడించారు. వీళ్లిద్దరు మణిపాల్ యూనివర్శిటీలో ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌గా తేల్చారు. ప్రణవ్ తండ్రి డెంటిస్ట్ కాగా.. వర్ధన్ తండ్రిది ఒక చిన్నపాటి బిజినెస్ అని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ కారు ప్రమాదానికి గల కారణాలమైన విచారణ చేస్టున్నామని.. ప్రణవ్, వర్ధన్‌లకు చికిత్స అందిస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు. ప్రణవ్ నడుపుతున్న కారు.. అతని తండ్రి విజయ్ కుమార్ పేరు మీద ఉన్నట్టు గుర్తించారు. ప్రణవ్ మద్యం సేవించి కారు నడిపాడని ప్రాథమిక విచారణలో తేలగా, రిపోర్ట్స్ వచ్చేవరకూ ఏది తేల్చలేమని అధికారులు చెప్తున్నారు.
NTR30: అఫీషియల్ – తారక్ ఫ్యాన్స్‌కి ఒకటి గుడ్.. మరొకటి బ్యాడ్ న్యూస్
మరోవైపు.. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని శ్రీనివాస్, ఈశ్వరిగా గుర్తించారు. ఈశ్వరి భీమవరంకు చెందగా, శ్రీనివాస్ రావులపాలెంకు చెందినవాడు. ఈశ్వరి ఇళ్లల్లో చిన్నపాటి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుండగా, శ్రీనివాస్ పెయింటర్‌గా పని చేస్తున్నాడు. తెల్లవారు జామున రాయల్ టిఫిన్స్ వద్ద వీరిని కారు ఢీ కొట్టడంతో.. అక్కడికక్కడే మృతి చెందారు. వీరి మృతదేహాలకు ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు బాడీలు అప్పగించారు. కాగా.. 5:30 గంటల సమయంలో ప్రణవ్, వర్ధన్‌లు ఉన్న కారు అదుపు తప్పి ఆగి ఉన్న మరో రెండు కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్, ఈశ్వరిని కారు గుద్దడంతో.. వాళ్లు పది అడుగుల మేర పైకి ఎగిరిపడినట్టు తెలిసింది. ప్రణవ్ కారు నడుపుతుండగా, వర్ధన్ అతని పక్క సీట్‌లో కూర్చున్నాడు. ఈ ఘటనలో కార్ల ముందు భాగాలు నుజ్జునుజ్జుయ్యాయి. టైర్లు విడిపోయి, చాలా దూరంగా పడ్డాయి.
Cool Drinks: కూల్‌డ్రింక్స్ తెగ తాగుతున్నారా.. ఈ తిప్పలు తప్పవు.. తస్మాత్ జాగ్రత్త!