హైదరాబాద్(Hyderabad) నగరంలోని పలు చోట్ల మళ్లీ వర్షం కురుస్తోంది. రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజధానిలో మధ్యహ్నం నుంచి వర్షం మొదలైంది.
గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాల కారణంగా జంట జలాశయాలైన గండిపేట, హిమాయత్ సాగర్ కు భారీగా వరద ప్రవాహం చేరింది. హిమాయత్ సాగర్ 2 ఫీట్ల మేరా 4 గేట్లు, గండిపేట 4 ఫీట్ల మేరా 6 గేట్లు ఎత్తి జల మండలి అధికారులు నీటిని విడుదల చేసారు. దీంతో.. వికారాబాద్, శంకర్‌పల్లి, మోకిలా, పరిగి, షాబాద్, షాద్‌నగర్ నుండి జలాశయాలకు భారీగా వరద నీరు చేరుకుంటోంది. రాజేంద్రనగర్ నుండి హిమాయత్ సాగర్…