Rain Alert: తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు లేవు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంతేకాదు ఈరోజు తెల్లవారుజాము నుంచి పలుచోట్ల చిరు జల్లులు కురిశాయి.
Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. రానున్న మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
TS Rains: బంగాళాఖాతంలో ఇప్పటికే అల్పపీడనం ఏర్పడింది. రేపు (24) దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Huge rain at hyderabad: ఋతుపవనాల ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. తాజాగా తెలంగాణ రాజధాని హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. మొదలైంది. హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తుండటంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ముఖ్యంగా మణికొండ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మియాపూర్, యూసుఫ్ గూడ, అమీర్పేట్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, ఎల్బీనగర్, నాగోల్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతున్న క్రమంలో అక్కడి రోడ్లు అన్నీ కాలువలను…
Rains In Hyderabad: తెల్లవారుజామున వర్షం హైదరాబాద్ ప్రజలను పలకరించింది. భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి గంటపాటు కుండపోత వర్షం కురిసింది. ఈ భారీ వర్షంతో నగరమంతా అస్తవ్యస్తంగా మారింది.
గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాల కారణంగా జంట జలాశయాలైన గండిపేట, హిమాయత్ సాగర్ కు భారీగా వరద ప్రవాహం చేరింది. హిమాయత్ సాగర్ 2 ఫీట్ల మేరా 4 గేట్లు, గండిపేట 4 ఫీట్ల మేరా 6 గేట్లు ఎత్తి జల మండలి అధికారులు నీటిని విడుదల చేసారు. దీంతో.. వికారాబాద్, శంకర్‌పల్లి, మోకిలా, పరిగి, షాబాద్, షాద్‌నగర్ నుండి జలాశయాలకు భారీగా వరద నీరు చేరుకుంటోంది. రాజేంద్రనగర్ నుండి హిమాయత్ సాగర్…
భాగ్య నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి నగరాన్ని మేఘాలు కమ్ముకున్నాయి. నగరం పూర్తిగా కారుమబ్బులతో పూర్తిగా చీకటిమయంగా మారింది. ఉదయం 8 గంటల నుంచి అక్కడక్కడ చిరజల్లులు కురుస్తున్నాయి. నేడు నగరంలో భారీ వర్షాలు పడే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. నగర ప్రజలకు పలు సూచనలు జారీ చేసారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు భారీగా వర్షం పడే అవకాశం…