Heavy Rains Today and Tomorrow: తెలంగాణను వీడని వరుణుడు.. నేడు, రేపు భారీ వర్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణాను వరుణుడు వీడనంటున్నాడు. నాలుగైదు రోజుల నుంచి నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి హైదరాబాద్ తడిసి ముద్దైంది. దీంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుంది. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు జోరందుకున్నాయి. అయితే ఈనేపథ్యంలో.. నైరుతి రుతుపవనాలు తెలంగాణపై చురుకుగా కదులుతున్నాయి. దీనికి తోడు అల్పపీడన ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉంది. అయితే.. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. మూడు నాలుగు రోజులుగా హైదరాబాద్ మహానగరంతోపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఇక వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుండటంతో నేడు, రేపు (శని,ఆదివారా)ల్లో కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిసింది. ఇక తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉన్న అల్పపీడనం శుక్రవారం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో వాయవ్య బంగాళాఖాతం వద్ద స్థిరంగా కొనసాగుతున్నదని పేర్కొన్నది. ఇక రానున్న 36 గంటల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ ఓడిశా తీరాలకు దగ్గరలో ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై మరింత బలపడే అవకాశం ఉందని వివరించింది. ఇక జైసల్మేర్, ఉదయ్‌పూర్, జల్గావ్, రామగుండం మీదుగా బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రాంతంపైనుంచి ఉపరితల ద్రోణి వెళ్తున్నదని తెలిపింది.
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
ఈసందర్బంగా.. మరో ద్రోణి అల్పపీడన ప్రాంతం నుంచి దక్షిణ తెలంగాణ మీదుగా ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించిందని పేర్కొంది.. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. నిన్న అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపట్నంలో 20.90 సెంటీమీటర్ల వర్షంకురిసింది. శనివారం నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో అతి భారీవర్షాలు కురుస్తాయని ఆరెంజ్ హెచ్చరిక జారీచేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో హెచ్చరిక జారీచేసింది.
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!