తెలంగాణాను వరుణుడు వీడనంటున్నాడు. నాలుగైదు రోజుల నుంచి నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి హైదరాబాద్ తడిసి ముద్దైంది. దీంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుంది. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు జోరందుకున్నాయి. అయితే ఈనేపథ్యంలో.. నైరుతి రుతుపవనాలు తెలంగాణపై చురుకుగా కదులుతున్నాయి. దీనికి తోడు అల్పపీడన ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉంది. అయితే.. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. మూడు నాలుగు రోజులుగా హైదరాబాద్ మహానగరంతోపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.…