నైరుతి రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
TS Rains: తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర తమిళనాడు తీరానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.