NTV Telugu Site icon

Forest officials: అటవీశాఖ అధికారులకు సర్కార్‌ గుడ్‌ న్యూస్‌.. వారికి రూ.కోటి వరకు..

Forest Officers

Forest Officers

Forest officials: అటవీ రక్షణలో భాగంగా విధి నిర్వహణలో అసాంఘిక శక్తుల దాడుల్లో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది మరణిస్తే భారీ పరిహారం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ తో సహా, చాలా రాష్ట్రాల్లో అసాంఘిక దాడుల్లో అటవీశాఖ సిబ్బంది మరణిస్తే అందని పరిహారం అందించేందుకు సిద్దమైంది. తొలి సారి తెలంగాణ ప్రభుత్వం విధాన పరమైన నిర్ణయం ప్రకటించడంతో అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read also: Netherlands Train Accident : నెదర్లాండ్స్ లో ఘోర రైలు ప్రమాదం

అటవీ శాఖ ఉద్యోగులు చాలా మంది తమ ప్రాణాలను పణంగా పెట్టి అటవీ ప్రాంతాన్ని కాపాడుతున్నారు. విధి నిర్వహణలో అనేక దాడులను ఎదుర్కోవాల్సిన క్రమంలో సంఘ‌వ్యతిరేక శక్తులు, తీవ్రవాదుల చేతుల్లో కొంత మంది చ‌నిపోతున్నారు. కొందరు వ్యక్తులు ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగినప్పటికీ, వారు తీవ్రంగా గాయపడి తమ విధులకు శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితులు తలెత్తు తున్నాయి. అలాంటి వారిని, వారి కుటుంబాలను ఆదుకునేందుకు కేసీఆర్ సర్కార్ గట్టి నిర్ణయమే తీసుకుంది. విధి నిర్వహణలో భాగంగా ఉగ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తుల చేతిలో మృతి చెందే అటవీశాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ నష్టపరిహారం ప్రకటించింది. ర్యాంక్ వారీగా అధికారులకు రూ. 30 లక్షల నుంచి రూ. కోటి మేరకు పరిహారం అందించనుంది. ఈమేరకు తాజాగా జీవో విడుదల చేసింది. కేటగిరీల వారీగా పరిహారం నిర్ణయించబడింది. అటవీ పరిరక్షణలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లో మరణించిన బీట్ ఆఫీసర్ తత్సమాన స్థాయి ఉద్యోగులకు రూ. 30 లక్షలు, పనికి శాశ్వతంగా గైర్హాజరైతే రూ. 20 లక్షలు, తీవ్ర గాయం అయితే రూ. 3 లక్షల పరిహారం ప్రకటించారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, డిప్యూటీ రేంజ్ అధికారి మరణిస్తే రూ. 45 లక్షలు, పనికి శాశ్వతంగా గైర్హాజరైతే రూ. 25 లక్షలు, తీవ్ర గాయాలు అయితే రూ. 5 లక్షలు, అటవీ రేంజ్ అధికారులు చనిపోతే రూ. 50 లక్షలు, శాశ్వతంగా అసమర్థులైతే రూ. 30 లక్షలు, తీవ్ర గాయమైతే రూ. 5 లక్షలు. అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ స్థాయి ఉద్యోగులు మరణిస్తే రూ. 75 లక్షలు, డ్యూటీకి శాశ్వతంగా గైర్హాజరైతే రూ. 40 లక్షలు, తీవ్ర గాయమైతే రూ. 5 లక్షలు, ఐఎఫ్‌ఎస్ అధికారులు దాడుల కారణంగా విధి నిర్వహణలో మరణిస్తే రూ. కోటి, అసమర్థ గాయం అయితే రూ. 50 లక్షలు, తీవ్ర గాయాలు అయితే రూ. 6 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మొత్తాన్ని బాధితులకు లేదా వారి కుటుంబ సభ్యులకు అందజేస్తారు.
Vallabhaneni Vamsi: సీఎం జగన్‌ సమీక్షకు డుమ్మా..! వల్లభనేని వంశీ స్పందన ఇదే..

Show comments