జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైన్ టేకాఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 270 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ నేపథ్యంలో బుధవారం ఎయిర్ ఇండియా తన బోయింగ్ 787 విమానంలోని ఫ్యుయల్ కంట్రోల్ స్విచ్ (FCS) లాకింగ్ మెకానిజం తనిఖీని పూర్తి చేసిందని, ఎటువంటి లోపం లేదని ఎయిర్‌లైన్ అధికారి ఒకరు తెలిపారు. బోయింగ్ 787 విమానాలలోని ఇంధన నియంత్రణ స్విచ్ లాకింగ్ విధానం గురించి మా ఇంజనీరింగ్ బృందం వారాంతంలో జాగ్రత్తగా దర్యాప్తు ప్రారంభించింది.
Also Read:The RajaSaab : బాబోయ్.. భారీ ధర పలుకుతున్న రాజాసాబ్ నాన్ థియేట్రికల్ రైట్స్
దర్యాప్తు పూర్తయింది. దానిలో ఎటువంటి లోపం బయటపడలేదని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు తెలిపారు. బోయింగ్ నిర్వహణ షెడ్యూల్ ప్రకారం అన్ని ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 విమానాలను థ్రాటిల్ కంట్రోల్ మాడ్యూల్ (TCM) తో భర్తీ చేశామని, ఇందులో FCS ఒక భాగమని కూడా ఆ అధికారి తెలిపారు. ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడానికి ముందు టేకాఫ్ అయిన వెంటనే ఇంధన స్విచ్‌లు ఆఫ్ అయ్యాయని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదిక ప్రకారం, బోయింగ్ 787, 737 విమానాలలో ఇంధన స్విచ్ లాకింగ్ వ్యవస్థను తనిఖీ చేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సోమవారం అన్ని విమానయాన సంస్థలను ఆదేశించింది.
Also Read:Andre Russell: అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్ మెన్
శనివారం విడుదలైన AAIB 15 పేజీల ప్రాథమిక దర్యాప్తు నివేదిక ప్రకారం, బోయింగ్ 787-8 విమానం రెండు ఇంజిన్లకు ఇంధన సరఫరా ఒక సెకను వ్యవధిలో ఆగిపోయిందని, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కాక్‌పిట్‌లో గందరగోళం ఏర్పడిందని వెల్లడించింది. నివేదిక ప్రకారం, రెండు ఇంజిన్లలోని ఇంధన-నియంత్రణ స్విచ్‌లు రన్ నుంచి కటాఫ్ స్థానాలకు కదిలాయి, దీనివల్ల విమానం పైకి ఎగరలేకపోయింది. దీంతో పెను విషాదం చోటుచేసుకుంది.