Missing Case: మల్కాజ్‌గిరిలో నివాసముంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడు హర్షవర్థన్ మిస్సింగ్ మిస్టరీగా మారింది. నిన్న సాయంత్రం 6.15 కు ఇంటి ముందు నుండి హర్షవర్థన్ కనిపించకుండా పోయాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్పెషల్ టీంతో బాలుడి ఆచూకీకోసం ఆరా తీస్తారు. అయితే ఇప్పటికి 17 గంటలు దాటిన హర్షవర్థన్ ఆచూకి కనిపించలేదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మల్కాగిరిలో హర్షవర్ధన్ కుటుంబం నివాసం ఉంటోంది. హర్ష నాన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి. అయితే నిన్న సాయంత్రం హర్ష ఆడుకోవడానికి బయటకు వెళ్లాడు అయితే ఎంతకు ఇంటికి తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన హర్ష పేరెంట్స్ వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు హర్ష కోసం నిన్నటి నుంచి గాలిస్తున్నారు. అయినా హర్ష ఆచూకీ కనపడలేదు. అక్కడే వున్న సీసీ కెమెరాలు పరిశీలించగా హర్ష అక్కడి నుంచి నడుచుకుంటూ వెళుతున్నట్లు రికాడ్డు అయ్యాయి. అయితే ఆతరువాత హర్ష ఎక్కడి వెళ్లాడే అనే విషమై ప్రశ్నిర్థకంగా మారింది. ఒక వేళ హర్షను కిడ్నాప్ చేసి ఉంటే ఇప్పటికే పేరెంట్స్ కు కాల్ చేసి ఉండాలని కానీ కాల్ రాలేద. హర్షను కిడ్నాప్ చేశారా? లేక హర్షనే ఇంటి నుంచి వెళ్లి పోయాడా? అనే అనుమానం వ్యక్తం అవుతున్నాయి. అయితే నిన్న నుంచి హర్ష ఆచూకీ కపడక ఇప్పటికి 17 గంటలు గడుస్తుంది. అయినా హర్షవర్థన్ ఆచూకి కనిపించలేదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మల్కాజ్గిరి మౌలాలి పరిసర ప్రాంతాల్లో హర్షవర్ధన్ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు గాలిస్తున్నారు. హర్షవర్ధన్ ఆచూకీ కనిపెట్టినందుకు ప్రత్యేక టీమ్ ల ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజ్ లను సేకరించి హర్ష ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు.
Read also: Kodali Nani: నవనీత్ కౌర్, సుమలత ఎంపీలు అయ్యారు.. పవన్ కల్యాణ్ ఇంకా..!
ఎనిమిదవ తరగతి చదువుతున్న హర్షవర్థన్ నిన్న సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. రోడ్డు మీదకి నడుచుకుంటూ వస్తున్నట్లు సీసీ కెమెరాల్లో దృష్యాలు రికార్డు అయ్యాయి. రోడ్డు మీదకి వచ్చాక హర్ష కనిపించలేదు. తమ కొడుకు హర్షవర్థన్ ని కిడ్నాప్ చేశారని తల్లిదండ్రులు అంటున్నారు. ఇద్దరి పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హర్షను కిడ్నాప్ పై తల్లిదండ్రులు మాట్లాడుతూ.. రమేశ్ అనే వ్యక్తితో వ్యాపారలావాదేవీల్లో విభేదాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు అంటున్నారు. గత మూడు నెలలుగా విభేదాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా నే తన కొడుకును కిడ్నాప్ చేశాడని అనుకుంటున్నామని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు రమేశ్ సమాచారం ఇచ్చామంటున్న తండ్రి తెలిపాడు. మేనమామ కొడుకుకి తన కూతురుని ఇవ్వక పోవడంతో మాపై కక్ష్య పెట్టుకున్నాడని అన్నారు. గతంలోనే పది లక్షలు ఖర్చు చేసైనా మీ అంతు చూస్తానని బెదిరించాడని హర్ష తండ్రి తెలిపాడు. ఇతని పైన అనుమానం ఉందంటున్న తల్లి దండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Sanjivani Scam: సంజీవని స్కామ్‌పై బహిరంగ చర్చకు సిద్ధం: కేంద్ర మంత్రి షెకావత్