రాబోయే రోజుల్లో నీటికొరతను నివారించేందుకు, భవిష్యత్ తరాల కోసం నదుల్ని పరిరక్షించాల్సిన అవసరం వుందన్నారు మంత్రి హరీష్ రావు. నదుల పరిరక్షణ, నదుల పునరుద్ధరణ పైనే సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు. మిషన్ కాకతీయను ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్తున్నారు. మిషన్ కాకతీయతో పడ్డ ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టి ఆయకట్టు పెంచుకున్నాం. రాష్ట్రంలో 46 వేల చెరువులను పునరుద్ధరించుకున్నాం.కుంభవర్షాలు పడ్డా ఎక్కడా చెరువులు తెగలేదు. భూగర్భజలాలు పెరిగాయి.4వేల చెక్ డ్యామ్ లను 6వేల కోట్లతో నిర్మించుకున్నాం.…