Adipurush Teaser: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఆదిపురుష్’ మూవీ నుంచి టీజర్ ఈరోజు విడుదలైంది. గుజరాత్‌లోని అయోధ్యలో నిర్వహించిన భారీ ఈవెంట్‌లో టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. టీజర్‌లో ప్రభాస్ చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం ఉంటుందని ప్రభాస్ రౌద్రంతో చెప్పిన డైలాగ్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. న్యాయం రెండు పాదాలతో పది తలల నీ అన్యాయాన్ని ఎదురించడానికే అని ప్రభాస్ చెప్పే డైలాగ్ కూడా బాగుంది. ఆగమనం.. అధర్మ విధ్వంసం అని టీజర్ చివర్లో ప్రభాస్ గంభీరంగా చెప్తాడు. ఈ టీజర్ మొత్తాన్ని విజువల్ ఎఫెక్టులతో నింపేశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. జై శ్రీరామ్.. జై శ్రీరామ్ అంటూ సాగే బీజీఎం గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 12న విడుదల కానుంది. ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటిస్తున్నారు.
కాగా ఒక నిమిషం 40 సెకన్‌ల నిడివితో ఈ టీజర్ ఉంది. టీజర్‌లో సైఫ్ అలీఖాన్ రాక్షసుడి పాత్రలో కనిపించాడు. నీటిలో రాముడిలా ప్రభాస్ ధ్యానం చేస్తున్న షాట్స్.. రామసేతు మీద నడుస్తున్న షాట్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయని అభిమానులు అంటున్నారు. ఈ మూవీని పాన్ ఇండియా సినిమాగా కాకుండా పాన్ వరల్డ్ సినిమాగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. బాహుబలితో ఇప్పటికే భారీ ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్ ఆదిపురుష్ మూవీతో తన ఇమేజ్‌ను రెట్టింపు చేసుకోనున్నాడు. 3డీ లోనూ ఆదిపురుష్ సందడి చేయనుంది. మొత్తానికి ఆదిపురుష్ టీజర్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.