Man Killed Over Land Issue: ప్రాణం తీసిన భూ వివాదం.. మార్నింగ్ వాక్ చేస్తుండగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Man Samarjith Singh Killed Bonagiri George In Ranga Reddy District Over Land Issue: భూవివాదం ఒక వ్యక్తి ప్రాణాలను బలిగొంది. మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో ఓ దుండగుడు ఆ వ్యక్తిపై రాడ్డుతో దాడి చేసింది. దీంతో అక్కడికక్కడే అతను కుప్పకూలిపోయాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కమ్మగూడలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. 12 గుంటల ల్యాండ్ విషయమై బోనగిరి జార్జ్ (62), సమర్జిత్ సింగ్ (52)ల మధ్య చాలాకాలం నుంచే గొడవలు జరుగుతున్నాయి. రోజులు గడిచేకొద్దీ వీరి మధ్య భూవివాదం మరింత ముదురుతూ వచ్చింది. దీంతో.. జార్జ్ అడ్డు తొలగించుకోవాలని సమర్జిత్ పక్కా ప్లాన్ వేశాడు. అతడు ప్రతిరోజూ మార్నింగ్ వాక్‌కి వెళ్తాడన్న విషయం తెలుసుకొని, ఆ సమయంలోనే మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు.
Pilot Rohith Reddy: నేడు మరోసారి ఈడీ ముందుకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
ప్లాన్ ప్రకారం.. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధి కమ్మగూడలో జార్జ్ మార్నింగ్ వాకింగ్ చేస్తుండగా, సమర్జిత్ ఆయన్ను అడ్డగించాడు. ల్యాండ్ విషయంపై మరోసారి వాగ్వాదానికి దిగాడు. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య తారాస్థాయిలో వాగ్వాదం జరిగింది. దీంతో కోపాద్రిక్తుడైన సమర్జిత్.. తనతో పాటు తెచ్చుకున్న రాడ్డును జార్జ్ తలపై గట్టిగా బాదాడు. ఆ దెబ్బకు జార్జ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తాను కొట్టిన దెబ్బకు జార్జ్ మరణించాడన్న విషయం తెలిసి.. సమర్జిత్ వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై స్థానికులతో పాటు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా, వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 12 గుంటల ల్యాండ్ విషయంలో జార్జ్, సమర్జిత్ మధ్య గొడవలు ఉన్నాయని.. ఈ హత్యకు ఆ భూవివాదమే కారణమని జార్జ్ కుటుంబీకులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న సమర్జిత్ కోసం గాలిస్తున్నారు.
Hawaii Flight Turbulence: విమానాన్ని కుదిపేసిన బలమైన గాలులు.. ఎగిరిపడ్డ ప్రయాణికులు
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!