Harish Rao: పేదలకు మరింత మెరుగైన వైద్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఏర్పాటయ్యాక పేదలకు మరింత మెరుగైన వైద్యం అందుతోందన్నారు రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. రాష్ట్ర ఏర్పాటు నుంచి క్యాన్సర్ చికిత్స కోసం ప్రభుత్వం రూ.750కోట్లు ఖర్చు చేసిందన్నారు.ప్రముఖ భారతీయ వైద్యుడు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్యాన్సర్ నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఆత్మకథ ‘The Journey of my life’ బుక్‌ను రాష్ట్ర ఆర్థిక, వైద్యరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు శనివారం ఆవిష్కరించారు. తెలుగు యూనివర్సిటీలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ అందరితో కలిసి బుక్‌ను ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. డాక్టర్ నోరి అమెరికా అధ్యక్షుడికే వైద్యం అందించిన పేదలకు సైతం సేవలందించారని కొనియాడారు. డాక్టర్ చదివే ప్రతి వారికి నోరి ఆత్మకథ ఉత్సాహాన్ని ఇస్తుందని, బుక్‌ను ప్రతి పౌరుడు చదవాల్సిన అవసరం ఉందన్నారు.
Read Also: khaki Ganpati: ముంబై పోలీస్ వెరైటీ ఆలోచన..కొలువు దీరిన “ఖాకీ గణేష్”
Also Read
క్యాన్సర్‌ను జయించిన వారి విజయాలను ఈ బుక్‌లో పొందుపరిచారని, ఇది అందరికీ స్ఫూర్తి అని, అద్భుతమైన పుస్తకం అని మంత్రి కొనియాడారు. విజయవంతమైన వైద్యుడి జీవితంలో ఎన్ని కష్టాలు, ఎంత శ్రమ ఉంటుందని.. వాటిని అధిగమించి ఉన్నత స్థితికి ఎలా చేరారనే విషయాలు ఈ పుస్తకం చదివితే తెలుస్తుందన్నారు. ఈ ఆత్మకథ ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతుందన్నారు. ప్రపంచంలో క్యాన్సర్ చికిత్సలో వస్తున్న అధునాతన విధానాలను వివరించారన్నారు. ఎంజేఎన్ ఆసుపత్రికి సలహాదారుడి ఉండి.. మెరుగైన వైద్యం పేదలకు అందేలా సహకారం అందించాలని డాక్టర్ నోరిని హరీశ్‌రావు కోరారు. పేదలు వైద్యం కోసం ఎక్కువ ఖర్చుపెట్టే స్థితిలో వుండరన్నారు. అందుకే ప్రభుత్వం వైద్య రంగంలో అధిక వ్యయం చేస్తోందన్నారు.
Read Also: Nasa: నాసా ఆర్టెమిస్-1 ప్రయోగం మళ్లీ వాయిదా.. కారణం ఇదే..!!
తాజావార్తలు
-
Astrology: జూలై 17 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!