HYDRAA : కోర్టు ఆదేశాలే పట్టవా?.. హైడ్రాపై హైకోర్టు ఫైర్.!
- స్టేటస్ కోపై వివాదం
- హైడ్రాపై కోర్టు ఆగ్రహం
- కూల్చివేతలపై వివరణ కోరింది
- తదుపరి విచారణ వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYDRAA : హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన, ఆస్తుల పరిరక్షణ సంస్థ (HYDRAA) వ్యవహారశైలిపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హయత్‌నగర్ పరిధిలోని ఒక వివాదాస్పద స్థలానికి సంబంధించి న్యాయస్థానం గతంలోనే స్పష్టమైన ‘స్టేటస్ కో’ ఆర్డర్ జారీ చేసినప్పటికీ, హైడ్రా అధికారులు ఆ ఆదేశాలను బేఖాతరు చేయడంపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోర్టు పరిధిలో ఉన్న ఆ స్థలంలోకి చొరబడటమే కాకుండా, అక్కడ ఉన్న నిర్మాణాలను అక్రమంగా కూల్చివేసి, అది పార్క్ స్థలమంటూ హైడ్రా బోర్డును ఏర్పాటు చేయడాన్ని న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. చట్టపరమైన నిబంధనలను, కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ హైడ్రా ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- Off The Record: పేకాట పంచాయితీతో కాంగ్రెస్‌లో చిచ్చు..! పేకాటా? పవర్ గేమా?
తమ స్థలంలో హైడ్రా బలవంతపు కూల్చివేతలకు పాల్పడటంపై బాధితుడు/పిటిషనర్ అత్యవసరంగా హైకోర్టులో ‘లంచ్ మోషన్’ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలు అమలులో ఉన్నప్పటికీ అధికారులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. న్యాయపరమైన ప్రక్రియను విస్మరించి ప్రైవేట్ ఆస్తుల వివాదాల్లో హైడ్రా జోక్యం చేసుకోవడంపై మండిపడింది. కోర్టు పరిధిలో ఉన్న కేసులను విస్మరిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించిన హైకోర్టు, ఈ కూల్చివేత వ్యవహారంపై పూర్తి వివరణ ఇవ్వాలని హైడ్రా అధికారులను ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!