Hanumakonda Ladies Hostel Robber Caught By Police Who Fell In Well: అతను ఓ యువకుడు. కారణాలేంటో తెలీదు కానీ, దొంగగా అవతారమెత్తాడు. ఒక గర్ల్స్ హాస్టలే అతని టార్గెట్. ఎక్కడి నుంచి ఊడిపడతాడో తెలీదు కానీ.. ఉన్నట్లుండి హాస్టల్‌లో దూరి, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లిపోతాడు. సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు దోచుకున్నాడు. పాపం అమ్మాయిలు.. అవి ఎలా మాయం అవుతున్నాయో తెలీక ఆందోళనలకు గురయ్యారు. ఓసారి ఆ దొంగ హాస్టల్‌లోని బాత్రూం డోర్‌ని సైతం బద్దలుకొట్టాడు. ఈ సంఘటన హాస్టల్‌లో తీవ్ర కలకలం రేపింది. ఆ దొంగను ఎలాగైనా పట్టుకోవాలని అనుకున్నారు. చివరికి తానే అనూహ్యంగా దొరికాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Singer Mangli: నాపై దాడి జరగలేదు.. అవన్నీ ఫేక్ వార్తలు
హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలంలో ఉన్న ఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్‌లో ఓ దొంగ వరుస దోపిడీలకు పాల్పడ్డాడు. ఎవ్వరికీ కనిపించకుండా హాస్టల్‌లో దూరి.. సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను దోచుకెళ్లిపోయాడు. ఓసారి బాత్రూం డోర్ పగలగొట్టి మరీ లోపలికి చొరబడ్డాడు. ఎప్పట్లాగే ఈ దొంగ శనివారం రాత్రి చోరీకి పాల్పడి.. ఎవ్వరికీ దొరక్కుండా ఉండేందుకు పొలాల గుండా పారిపోయాడు. కానీ.. చీకట్లో అతనికి బావి కనిపించలేదు. దాంతో.. అందులో పడిపోయాడు. అందులో నుంచి బయటకు వచ్చేందుకు చాలా ప్రయత్నించాడు కానీ, అతని వల్ల కాలేదు. దీంతో.. తనని కాపాడాల్సిందిగా కేకలు వేశాడు. రాత్రి సమయం కావడంతో.. అక్కడ ఎవ్వరు లేరు.
Risk Movie: ఘంటాడి కృష్ణ సినిమా పేరు మారింది.. మోషన్ పోస్టర్ రిలీజ్
ఆదివారం ఉదయం ఆ దొంగ మళ్లీ కేకలు వేయగా.. స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. రాత్రి హాస్టల్‌లో చోరీ చేసిన దొంగేనని అతడ్ని గుర్తించారు. చివరికి తాడు సహాయంతో అతడ్ని బయటకు తీసి, అదుపులోకి తీసుకున్నారు.