Independence Day : పంద్రాగస్టు వేడుకలకు గోల్కొండ కోట సిద్ధం..
- సీఎం రేవంత్ చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ
- వాటర్‌ప్రూఫ్ షామియానాలతో ప్రత్యేక ఏర్పాట్లు
- పోలీసు పరేడ్ రిహార్సల్స్ పూర్తి
- విద్యార్థులు, ప్రముఖుల కోసం ప్రత్యేక గ్యాలరీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Independence Day : భారత స్వాతంత్య్ర త్య్ర దినోత్సవ (పంద్రాగస్టు) వేడుకల కోసం చారిత్రాత్మక గోల్కొండ కోట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ శుభసందర్భంగా గోల్కొండ కోట ప్రాంగణంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేసి, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ వేడుకలకు మంత్రులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, విఐపిలతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకానుండటంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు.
ప్రత్యేక గ్యాలరీలు, వర్షం పడినా ఇబ్బంది లేని వాటర్‌ప్రూఫ్ షామియానాలు
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి వేడుకలకు ఎక్కడా ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యేకంగా వాటర్‌ప్రూఫ్ షామియానాలు ఏర్పాటు చేశారు. పంద్రాగస్టు దృష్ట్యా విచ్చేసే అతిథులు, ప్రముఖుల కోసం ప్రత్యేక గ్యాలరీలను సిద్ధం చేశారు. అలాగే వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీటి సదుపాయాలు, భద్రత కోసం బారికేడింగ్ , సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ చర్యలు చేపట్టారు. ఈ వేడుకలను తిలకించడానికి నగరంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలిరానుండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు.
Also Read
ముగిసిన పరేడ్ రిహార్సల్స్.. వేడుకలకు సర్వం సిద్ధం
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించే పోలీసు గౌరవ వందనం, పరేడ్ రిహార్సల్స్ ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయి. పోలీసు కవాతు , సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. చారిత్రక గోల్కొండ కోట ప్రాంగణం పంద్రాగస్టు సంబరాలకు పూర్తి స్థాయిలో సిద్ధమైంది.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
-
NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
-
Antera Closed: ఎన్టీవీ ఎఫెక్ట్.. చివరకు మూతపడిన ‘అంతేరా’.!
-
Explainer: సూపర్ ఎల్‌నినో కాటు.. 2.3లక్షల మంది బలి?
-
AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!