Bonalu: నేటినుంచి ఆషాఢ బోనాలు.. గోల్కొండ జగదాంబకు తొలిబోనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నగరానికి ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. నగరానికి ఆషాఢ మాసం రాకతో బోనాల సందడి మొదలవుతుంది. బోనాల ఉత్సవాలతో నగరంలో బస్తీలు, కాలనీలు కళకళలాడుతాయి. భక్తులు తమ ఇష్టదైవానికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. హైదరాబాద్ లో తొలి బోనం గురువారం చారిత్రక గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక ఎల్లమ్మ అమ్మవారికి సమర్పణతో ఉత్సవాలు మొదలవుతాయి. ఇవాల్టి నుంచి వచ్చేనెల 28వ తేదీ వరకు తొమ్మిదివారాల (గురు,ఆదివారాలు)పాటు ఆషాఢమాస బోనాలను చారిత్రక గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో దేవాదాయ శాఖ ఘనంగా నిర్వహించనుంది. బోనాలు ఉత్సవాలకు సంబంధించి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
నేటి నుంచి (గురువారం) మధ్యాహ్నం 12 గంటలకు లంగర్‌హౌస్ చౌరస్తాలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈనేపథ్యంలో లంగర్‌హౌస్ చౌరస్తా నుంచి అమ్మవారి పట్టువస్త్రాలు.. తొట్టెల ఊరేగింపుతో జాతర ప్రారంభం అవుతుంది. బోనాల నేపథ్యంలో.. గోల్కొండ జగదాంబికకు 9 వారాల పూజల సందర్భంగా గోల్కొండ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అయితే.. ఈ ఆంక్షలు పూజలు జరిగే రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమల్లో ఉంటాయి.
Also Read
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
- Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
కాగా.. రాందేవ్‌గూడ టు గోల్కొండ కోట వయా మక్కీదర్వాజ, లంగర్‌హౌస్ టు గోల్కొండ వయా ఫతేదర్వాజ, షేక్‌పేట నాలా, సెవెన్‌టూంబ్స్ టు గోల్కొండ కోట వయా బంజారాదర్వాజ మార్గంలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే.. కరోనా కారణంగా రెండు సంవత్సరాల నుంచి బోనాలు అంతగా జరగకపోవడంతో.. ఈసారి పూర్తిస్థాయిలో గోల్కొండ బోనాల జాతర జరుగుతుండడంతో రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిమంది తరలివచ్చే అవకాశాలు ఉన్నాయని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని జగదాంబిక అమ్మవారికి ఆలయ ట్రస్టు చైర్మన్ వావిలాల మహేశ్వర్ తెలిపారు.
Breaking: తెగిపడిన హైటెన్షన్ విద్యుత్ వైర్లు.. 8 మంది సజీవదహనం
తాజావార్తలు
-
Crude Oil Prices: ఇరాన్‌కు ట్రంప్ ఊహించని షాక్.. ఆకాశాన్నంటిన క్రూడ్ ఆయిల్ ధరలు..
-
Colombia Earthquake: 7.4 తీవ్రతతో భూకంపం.. 111 మంది మృతి, శిథిలాల కింద పలువురు
-
Agadha Pre Release Event: ‘అగధ’తో ఎంఎస్ రాజు కమ్‌బ్యాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదిరిపోయే రెస్పాన్స్.. కల్ట్ క్లాసిక్ అవుతుందా?
-
Astrology: ఆగస్టు 11 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!