Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. ఆ టైంలో ట్రైన్లలో మొబైల్ ఛార్జింగ్ బంద్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Railways: ట్రైన్ ప్రయాణికులకు ఇండియన్ రైల్వే ఊహించని షాక్ ఇచ్చింది. రాత్రిపూట ప్రయాణించేటప్పుడు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఛార్జింగ్ పెట్టుకుందామనుకుంటే ఇకపై కుదరదు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ట్రైన్లలోని ఛార్జింగ్ పాయింట్లను పూర్తిగా ఆఫ్ చేయాలని రైల్వే బోర్డు అన్ని జోన్లను ఆదేశించింది. ఇటీవల ఓ రైలులో ఛార్జింగ్‌లో పెట్టిన పవర్ బ్యాంక్ పేలిపోవడంతో రైల్వే శాఖ ఈ నిర్ణయాన్ని అత్యంత కఠినంగా అమలు చేయాలని ఫిక్స్ అయింది.
సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలో ఇటీవల జరిగిన ఒక ఘటనే ఈ కఠిన ఆంక్షలకు ప్రధాన కారణం అని చెబుతున్నారు. రైలు సిబ్బంది నిర్లక్ష్యంతో నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా ఛార్జింగ్ పాయింట్లను ఆఫ్ చేయలేదు. దీంతో ఓ ప్రయాణికుడు ఛార్జింగ్ పెట్టిన పవర్ బ్యాంక్ ఒక్కసారిగా పేలిపోయి, బోగీ అంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ, బోగీలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఉదంతాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకున్న రైల్వే బోర్డు, రాత్రి వేళల్లో ఛార్జింగ్ ఆపేయాలన్న రూల్‌ని ఇకపై పక్కాగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Also Read
- Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
- Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
- Jio Platforms IPO Listing: నేడు స్టాక్ మార్కెట్లోకి జియో ఎంట్రీ.. GMP రూ.247, లిస్టింగ్ ధర ఎంత ఉండొచ్చు?
- BCG Report 2026: పెట్రోల్ యుగానికి బ్రేక్ పడనుందా? భారత టూ వీలర్ మార్కెట్లో కొత్త ట్రెండ్..
నిజానికి 2014 నుంచే రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు ఛార్జింగ్ సాకెట్లను ఆఫ్ చేయాలనే రూల్ ఉన్నప్పటికీ, చాలా రైళ్లలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తేలింది. దీంతో రంగంలోకి దిగిన రైల్వే బోర్డు.. ఇకపై ఎలాంటి మినహాయింపులు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. సిబ్బందికి తగిన ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు, రాత్రి వేళల్లో నిబంధనలు పాటిస్తున్నారా లేదా అన్నది చెక్ చేసేందుకు ప్రత్యేక బృందాలతో ‘సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్లు’ నిర్వహించాలని అధికారులను ఆదేశించింది.
2013లో నాందేడ్-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ ఏసీ కోచ్‌లో జరిగిన అగ్ని ప్రమాదం తర్వాతే ‘కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ’ ఈ నిబంధనను ప్రతిపాదించింది. ఆ తర్వాత 2023లో ఢిల్లీ-దర్భంగా హమ్‌సఫర్ స్లీపర్ క్లాస్‌లోనూ మంటలు చెలరేగడంతో స్లీపర్ బోగీల్లోనూ అమలు చేయాలని సూచనలొచ్చాయి. అయితే సాధారణ స్లీపర్ బోగీల్లో రాత్రిపూట పాయింట్లు ఆఫ్ చేసేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించడం భారీ ఖర్చుతో కూడుకున్న పని కావడంతో, ప్రస్తుతానికి ఈ నిషేధం కేవలం ఏసీ బోగీలకే పరిమితమైంది. రాత్రి వేళల్లో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో పరికరాలను ఛార్జింగ్‌లో వదిలేయడం వల్ల ఓవర్‌హీటింగ్ జరిగి మంటలు చెలరేగే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా, ఇలా రాత్రిపూట ఫోన్లు ఛార్జింగ్‌లో పెట్టి నిద్రపోవడం వల్ల దొంగతనాలకు ఆస్కారం ఎక్కువవుతోందని రైల్వే శాఖ పేర్కొంది. అందుకే ట్రైన్ ఎక్కే ముందే ఫోన్లను ఫుల్ ఛార్జ్ చేసుకోవాలని ప్రయాణికులకు సూచిస్తోంది.
తాజావార్తలు
-
Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. ఆ టైంలో ట్రైన్లలో మొబైల్ ఛార్జింగ్ బంద్!
-
Hyderabad: డాక్టర్ పి.వి. రమణ రచించిన “ఇండియాస్ మావోయిస్ట్స్” పుస్తకావిష్కరణ
-
Food Safety Raids: హైదరాబాద్‌లో స్వీట్ తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Hyderabad Food Safety Raids: ఎలుకల విసర్జనలు, బొద్దింకల మధ్య స్వీట్ల తయారీ.. తనిఖీల్లో విస్తుపోయే నిజాలు..
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!