Pakistan Espionage Case: ఏపీలో ‘ఆపరేషన్ ఫైర్వాల్–2026’.. పాక్ గూఢచర్యం కేసులో మరో ఇద్దరి అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Espionage Case: పాకిస్థాన్ గూఢచర్యం కేసులో ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ‘ఆపరేషన్ ఫైర్వాల్–2026’లో భాగంగా దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. ఈ ఆపరేషన్ రెండో దశను అక్టోబర్ 25 నుంచి ప్రారంభించి, అనుమానితుల నెట్వర్క్పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. బీహార్లోని రక్సౌల్ ప్రాంతానికి చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నేపాల్ సరిహద్దు ప్రాంతంతో సంబంధాలున్నవారిగా వారిని గుర్తించినట్లు సమాచారం. పాకిస్థాన్ ఏజెంట్ల వాట్సాప్ ఖాతాలను తెరవడానికి అవసరమైన భారత సిమ్ కార్డుల ఓటీపీలను నిందితులు అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
నిందితులకు నగదు చెల్లింపులు చేసేందుకు ఇతరుల పేర్లతో ఉన్న ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించినట్లు దర్యాప్తులో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ లావాదేవీల వెనుక ఉన్న వ్యక్తులు, నెట్వర్క్ వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇక, తూర్పు నౌకాదళ కమాండ్ పరిధిలోని యుద్ధనౌకలు, జలాంతర్గాములకు సంబంధించిన రహస్య సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించారా అనే కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారం చేరవేతలో నిందితుల పాత్ర ఏమైనా ఉందా అన్న అంశంపై ఆరా తీస్తున్నారు.
Also Read
అరెస్టయిన ఇద్దరు నిందితులకు న్యాయస్థానం నవంబర్ 10 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో గతంలో విశాఖపట్నం, కోయంబత్తూరులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మరో ఇద్దరు పట్టుబడటంతో గూఢచర్య నెట్వర్క్కు సంబంధించిన కీలక వివరాలను వెలికితీసేందుకు దర్యాప్తును వేగవంతం చేశారు. మొత్తంగా ‘ఆపరేషన్ ఫైర్వాల్–2026’ రెండో దశలో భాగంగా అనుమానితుల మధ్య సంబంధాలు, ఆర్థిక లావాదేవీలు, సమాచార మార్పిడిపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. పాకిస్థాన్ గూఢచర్య నెట్వర్క్ వెనుక ఉన్న ఇతర వ్యక్తులను గుర్తించి, పూర్తి వివరాలు వెల్లడించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
తాజావార్తలు
-
B2B UPI Payment Charges: వ్యాపార లావాదేవీలపై రూ.5 ఛార్జీ?.. NPCI కొత్త ప్రతిపాదన ఇదే!
-
Jasprit Bumrah Record: టెస్టుల్లో మరో అరుదైన ఘనత.. టాప్-10లోకి జస్ప్రీత్ బుమ్రా!
-
Can Beer Damage Your Kidneys: బీర్ తాగితే కిడ్నీలకు ఏం కాదనుకుంటున్నారా? తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు..
-
WhatsApp New Update: వాట్సాప్ యూజర్లకు శుభవార్త.. కొత్త ఫీచర్ వివరాలివే!
-
Hyderabad: అండాల దందా.. ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ల రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు..
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!