Telangana Rains: గోదావరి ఉగ్రరూపం.. ములుగు జలదిగ్బంధం, జూరాల గేట్లు ఎత్తివేత.!
- ప్రమాద స్థాయికి చేరిన గోదావరి నీటిమట్టం
- ములుగు ఏజెన్సీలో గ్రామాలు జలదిగ్బంధం
- జూరాల ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తివేత
- లోతట్టు ప్రాంతాల ప్రజలకు అధికారుల హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Rains: తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గోదావరి నది ప్రమాద హెచ్చరికలను మోగిస్తుండగా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు వద్ద గోదావరి నది అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నీటి మట్టం 19.36 మీటర్ల ఎత్తుకు చేరుకోవడంతో కేంద్ర జల సంఘం అధికారులు డేంజర్ లెవెల్ హెచ్చరికను జారీ చేశారు. నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ తక్షణమే అప్రమత్తమై సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.
ఎడతెరిపి లేని వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరద పోటుతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో ఏజెన్సీలోని అనేక అటవీ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వెంకటాపురం మండలంలో పెంకవాగు, జిన్నుల వాగులు ఉగ్రరూపం దాల్చడంతో తిప్పాపురం, పెంకవాగు, కొత్త గుంపు, సీతారాంపురం, ముత్తారం గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే కుక్కతోగు, బోధపురం వాగులు పొంగి వెంకటాపురం నుండి భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారిపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇటు వాజేడు మండలంలో కొంగల వాగు, బహుద జలపాతం వాగు ప్రవాహం తీవ్రమవ్వడంతో నేషనల్ హైవే 163 పైకి వరద నీరు చేరి సుమారు 25 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
Also Read
- CM Revanth Reddy : యువతకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్..!
- Telangana Civil Supplies: రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. 31 వరకే ఛాన్స్!
- Rega Kantha Rao: "పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడు".. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై యువతి ఫిర్యాదు.. కేసు నమోదు
- Hyderabad: ప్రధాని మోడీ AI మార్ఫింగ్ వీడియో.. మెటా హెడ్‌పై కేసు నమోదు..
మరోవైపు మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో అధికారులు 24 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 1,36,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, 1,33,000 క్యూసెక్కుల నీటిని ఔట్ ఫ్లో ద్వారా కిందకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1045 అడుగులు కాగా, ప్రస్తుతం 1041.962 అడుగులకు చేరుకుంది. మొత్తం 9.657 టీఎంసీల నీటి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 8.164 టీఎంసీల నీటి నిల్వ ఉంది. వరద ఉధృతి నేపథ్యంలో ఎగువ, దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రాల్లోని 11 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతుండటంతో పాటు వివిధ ఎత్తిపోతల పథకాలకు కూడా నీటిని విడుదల చేస్తున్నారు.
తాజావార్తలు
-
Telangana Rains: గోదావరి ఉగ్రరూపం.. ములుగు జలదిగ్బంధం, జూరాల గేట్లు ఎత్తివేత.!
-
SS Rajamouli: ‘వారణాసి’ తర్వాత రాజమౌళి ప్లాన్ ఇదేనా..?
-
Iran-US: హార్ముజ్ దగ్గర మళ్లీ ఉద్రిక్తతలు.. రెండు ట్యాంకర్లపై ఇరాన్ దాడి
-
Rohit Sharma New Look: హిట్‌మ్యాన్ ఫొటో లీక్ చేసిన రవిశాస్త్రి.. కొత్త లుక్‌తో ట్రెండింగ్‌లో రోహిత్ శర్మ
-
CM Revanth Reddy : యువతకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్..!
ట్రెండింగ్
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!