Gang War in Old City: హైదరాబాద్ పాతబస్తీ అంటే ఇక చెప్పనక్కర్లేదు. హైదరాబాద్ కే ఓల్డ్ సిటీ అడ్డాగా మారింది. అంతేకాదు కత్తులతో హడలెత్తించడం, గ్యాంగ్ వార్ లు జరగడం ఇక్కడ సర్వసాధారణంగా మారుతోంది. కొందరు పీకల్లోతు మందు తాగి గొడవలకు దిగిలే.. మరి కొందరు కక్ష్య సాధింపు, ఇంకొందరు కత్తులు, తల్వార్లతో దాడికి దిగుతుంటారు. కానీ పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో కాస్తంత ప్రసాంతంగా ఉంటుంది. కానీ పాతబస్తీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఏ సమయంలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకుంటాయో ఊహించడం చాలా కష్టం. ఓల్డ్ సిటీలో ఓ మహిళ ఇంట్లోకి చొరబడి గ్యాంగ్ వార్ ఘటన కలకలం రేపుతుంది. క్రికెట్ ఆడుతూ మహిళ ఇంట్లోకి బాల్ వెల్లడంతో అర్థరాత్రి పూట క్రికెట్ ఆడటం ఏంటని ప్రశ్నించినందుకు మాట మాట పెరిగి గొడవకు దారితీసింది. దీంతో ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
Read also: Lovers Killed : ప్రియుడితో పారిపోయేందుకు ప్లాన్.. తనలా ఉన్న మరో అమ్మాయి మర్డర్
ఓల్డ్ సిటీ చాంద్రాయణగుట్టలో బండ్లగూడా నూరినగర్ లో ఓ గ్యాంగ్ క్రికెట్ ఆడుతోంది. అక్కడున్న వారు ఆ పిల్లలు ఆడుతున్న క్రికెట్‌ను ఆనందంగా వీక్షిస్తుంటే.. మరి కొందరు తిట్టుకోవడం స్టార్ట్ చేశారు. అయితే కొద్దిసేపటి వరకు ఆనందంగా సాగిన క్రికెట్ ఒక్కక్షణంలో గొడవకు దారితీసింది. క్రికెట్ ఆడుతున్న సమయంలో బ్యాట్ మెన్ బాల్‌ను గట్టికొట్టడంతో ఓ ఇంట్లోని బాల్కనీలోకి వెళ్లిపడింది. దీంతో ఆ ఇంటి యజమాని ఓ మహిళ కోపంతో ఊగిపోయింది. మీకు క్రికెట్ ఆడటానికి వేళ పాల అంటూ మండిపడింది. ఈ టైంలో క్రికెట్ ఏంటని ఆ పిల్లలులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పిల్లలు ఆడితే మీకేమైంది అంటూ అక్కడే వున్న కొందరు వ్యక్తులు మహిళను ప్రశ్నించారు. దీంతో ఆ ఇంటి యజమాని మహిళ వారిపై కూడా మండిపడింది. ఇరువురు వ్యక్తుల మధ్య మాట మాట పెరిగి గాలివానైంది. కోపంతో అక్కడే వున్న వ్యక్తులు మహిళ ఇంటిపై దాడి చేశారు. ఈదాడిలో మహిళతో పాటు మరో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. అక్కడే వున్న స్థానికులు చాంద్రాయణగుట్ట పోలీసులకు సమాచారం అందించారు. హుటా హుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరువురిని శాంతిపజేసి పంపివేశారు. గాయపడిన వారిని హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Astrology : మార్చి 30, గురువారం దినఫలాలు