ది చెన్నై సిల్క్స్, శ్రీ కుమారన్ గోల్డ్ అండ్ డైమాండ్స్ మరియు గజనంద ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వయంవర మహోత్సవం పేరిట వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నట్లు సంస్థ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మహేష్ తెలియజేశారు. కూకట్ పల్లి ప్రశాంత్ నగర్ లోని శ్రీ శ్రీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది అని నిర్వాహకులు వెల్లడించారు.
అన్ని వర్గాలకు చెందిన వధూవరులకు పరిచయ వేదికగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని, దీనిలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని తెలిపారు. వివాహ పరిచయ వేదిక లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని తమ పేరు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేనేజర్స్ వినయ్,రామలింగం తదితరులు పాల్గొన్నారు.