Fake currency: యూట్యూబ్ చూసి నేరగాళ్లు కొత్త రకం నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా యూట్యూబ్ చూసి ఏకంగా ఓ గ్యాంగ్ రూ.500 నోట్లను ముద్రించారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో జరిగింది. నకిలీ నోట్ల తయారీ రాకెట్‌ని నడుపుతున్న ఇద్దరు వ్యక్తులతో పాటు రూ. 30,000 విలువైన ఫేక్ కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు.
నంద్యాల జిల్లా డోన్‌లో ఘరానా మోసం వెలుగు చూసింది. క్రిప్టో కరెన్సీ పేరుతో రామాంజనేయులు అనే మోసగాడు సుమారు రూ. 25 కోట్లు వసూలు చేశాడు. బైనాన్స్, ఒకే-ఎక్స్ యాప్స్‌లో ట్రేడింగ్ చేస్తూ, లక్ష పెట్టుబడికి నెలకు పదివేలు ఇస్తామంటూ నమ్మబలికాడు కేటుగాడు.. అలా దాదాపు రూ. 25 కోట్లు వసూలు చేశారు. కర్నూలు, నంద్యాల, మహబూబ్ నగర్ జిల్లాల్లో 300 మందికి పైగా భాదితులు ఉన్నట్టు సమాచారం.
పెరుగుతున్న 'డిజిటల్ అరెస్ట్' కేసులపై ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని నివారించడానికి.. ' ఆలోచించండి, చర్య తీసుకోండి' అనే మంత్రాన్ని దేశప్రజలతో పంచుకున్నారు.
TS DGP Whatsapp DP: ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి. మోసగాళ్లు రకరకాలుగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. గిఫ్ట్‌లు, కూపన్లు, కేవైసీల పేరుతో ఇప్పటి వరకు మోసం చేసిన మోసగాళ్లు.