ఆదిలాబాద్ లో అడవులు, వన్య ప్రాణులు ఎక్కువ అనే విషయం తెలిసిందే. ఉమ్మడి ఆదిలాబాద్ లో ఆ మధ్య ఓ పులి కలకలం రేపిన విషయం అందరికి తెలుస్తుంది. ఇక తాజాగా ఓ పులి రక్షణ లో నిర్లక్ష్యం వహించిన నలుగురు అటవీ శాఖ అధికారుల పై వేటు వేశారు. సిరిచెల్మ్, ఇంద్రవెల్లి రెంజ్ ల పరిధి లో ఇద్దరు సెక్షన్ ఆఫిసర్లు, ఇద్దరు బీట్ అధికారుల ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారుల ఉత్తర్వులు జారీ చేసారు. ఈ రెండు అటవీరేంజ్ ల పరిధి లో పులి హతం అయ్యింది. అక్కడ చర్మం పట్టుబడడంతో… పులి హతం అయిన విషయం బయట పడింది. అయితే ఆ ఆ పులి రక్షణ చర్యలు చేపట్టలేదని… అధికారులు నిర్లక్ష్యంగా ఉండటం వల్లనే పులి చనిపోయింది అని.. ఆ పులి ప్రాణాలకు నలుగురు అటవీ శాఖ అధికారులను బాధ్యులను చేస్తూ వేటు వేశారు ఉన్నతాధికారులు.