దేశ రాజధాని ఢిల్లీలో జీ20 సమ్మిట్ జరగనున్నందున అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలో జరగనున్న G20 సమ్మిట్ సందర్భంగా 80 మంది వైద్యులు, 130 అంబులెన్స్‌ల సముదాయం ఏదైనా వైద్య అత్యవసర పరిస్థితులను నిర్వహిస్తాయని అధికారులు శుక్రవారం తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీ భద్రత కోసం పోలీస్ రివ్యూ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేశారు.. 4 అంచల భద్రత ఏర్పాటు చేశారు.. వీఐపీ సెక్యూరిటీ, అప్పర్, లోయర్, మిడిల్ ఇలా ప్రధాని మోడీ చుట్టూ ఎస్పీజీ ఫోర్స్, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, సాయుధ బెటాలియన్ దళాలు మోహరించనున్నాయి..