Formula ERace : హైదరాబాద్ నగరంలో జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్‌లో అవకతవకలపై ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ రేస్‌లో అవినీతి జరిగిందని ఆరోపణలు రావడంతో ఏసీబీ గత తొమ్మిది నెలలుగా విచారణ జరిపింది. ఏసీబీ విచారణలో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్‌ను రెండుసార్లు ప్రశ్నించి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసింది. అలాగే, ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌ను కూడా విచారించినట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. E-car racing కు sponsorship చేసిన సంస్థల నుంచి BRS పార్టీకి 44 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లు
లాభం. ఈ విధంగా క్విడ్ ప్రో కో జరిగినట్టు నిర్ధారించింది ఏసీబీ.
Job Scam: ఏందయ్యా ఇది..! ఒకే వ్యక్తి, ఒకేసారి ఆరు జిల్లాల్లో ఉద్యోగం
అయితే.. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అనుమతి రాగానే కేటీఆర్‌తో పాటు ఈ రేసు నిర్వహణలో పాల్గొన్న ఇతర అధికారులపై ఛార్జ్‌షీట్ దాఖలు చేయడానికి ఏసీబీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఫార్ములా ఈ రేస్‌లో సుమారు ₹46 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు, దీనిపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. నివేదికను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Salman Lala: గ్యాంగ్‌స్టర్ అంత్యక్రియలు వేలాది మంది.. బాలివుడ్ నటుల సంతాపం.. ఇంతకీ ఎవరితను?
