Vinod Kumar: దేశంలో బీజేపీకి 272 సీట్లు రాకపోతే బీజేపీ వాళ్ళే మోడీ ప్రధాని మంత్రి పదవి చేపట్టకుండా చేస్తారనని మాజీ ఎంపీ వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న ఉత్తర ప్రదేశ్ లో మోడీ ప్రస్టేషన్ లో మాట్లాడుతున్నాడని అన్నారు. రామ మందిరం కూల్చే దమ్ము ఎవరికైనా ఉంటుందా ? అని ప్రశ్నించారని గుర్తు చేశారు. ఓడిపోతున్నాము అని తెలిసే మోడీ అలా మాట్లాడుతున్నాడని తెలిపారు. దేశంలో మోడీ వేవ్ కనిపిస్తుంది, ఆ ప్రభావం తెలంగాణలో ఉన్నదన్నారు. కాంగ్రెస్ ఓటింగ్ బీజేపీకి షిఫ్ట్ అయింది, కావాలంటే కరీంనగర్ వచ్చి అడగండన్నారు. 2019 లో పొన్నం ప్రభాకర్ కి డిపాజిట్ రాలేదు, ఈసారీ వెలిశాల రాజేందర్ రావుకి డిపాజిట్ పోతుందన్నారు. కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులే బీజేపీకి ఓటు వెయ్యమని చెప్పారు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గొప్పగా చెప్పుకునే పథకం ఒక్కటి లేదన్నారు.
Read also: Prithviraj Sukumaran : రాజమౌళి సినిమా లో పృథ్విరాజ్ సుకుమారన్.. క్రేజీ న్యూస్ వైరల్..?
కేబినెట్ సమావేశంలో నైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నా అని తెలిపారు. రైతులకు రోహిణి కార్తీ లోనే పెట్టుబడి సహాయం చేయాలన్నారు. రైతులు పంటలు కోసిన తర్వాత ఇటీవల రైతు బంధు ఇచ్చారన్నారు. వర్షా కాలనికి సంబంధించి రైతు బంధుగానీ, రైతు భరోసా గానీ వెంటనే ఇవ్వాలన్నారు. వరికి క్వింటాలుకు 500 బోనస్ ఇస్తామని చెప్పిన హామీ బోగస్ గా మార్చకండని తెలిపారు. సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇచ్చే ఆలోచన చేయడం సరికాదన్నారు. సన్న వెడ్లకే బోనస్ ఇస్తామని ఎన్నికల ముందు చెప్పి ఉంటే కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా రాకపోతుండే అని కీలక వ్యాఖ్యలు చేశారు. మరో ఆరు నెలలు పోతే రేవంత్ రెడ్డిని ఎవరు నమ్మరన్నారు. తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధర ఇచ్చి కొనాలని, ఇచ్చిన హామీలు అమలు చేసేలా కేబినెట్ నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.
Nagababu : మళ్లీ ట్విట్టర్ (X)లోకి నాగబాబు..