Jupally Krishna Rao : ఈ రోజుకు టీఆర్‌ఎస్‌లోనే ఉన్నా..! రేపు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు హాట్ టాపిక్‌గా మారిపోయింది.. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి.. నియోజకవర్గం అభివృద్ధి, అవినీతి విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా.. బహిరంగ చర్చకు ఇద్దరు నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో టెన్షన్ వాతావరణం నెలకొంది.. అయితే, ఇదే సమయంలో జూపల్లి కృష్ణారావు పార్టీ మారుతున్నారనే చర్చ కూడా సాగుతోంది.. కొల్లాపూర్ వెళ్తారా? చర్చలో పాల్గొంటారా? అనేది ఆసక్తికరంగా మారగా.. ఈ పరిణామాలపై మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు.. రేపు ఉదయం కొల్లాపూర్ వెళ్తున్నట్టు స్పష్టం చేశారు.. ఎస్పీ అనుమతి ఇవ్వని విషయం నాకు తెలియదన్న ఆయన.. మంత్రి కేటీఆర్ కు ఈ వ్యవహారంతో సంబంధం లేదన్నారు.
Read Also: Tarun Chug: కేసీఆర్‌కు బైబై చెప్పే టైం వచ్చింది..
Also Read
- KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
- Nitin Nabin : తెలంగాణలో త్వరలోనే 'కమలం' వికసిస్తుంది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు
- HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
- iPhone 16: ఫ్లిప్‌కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
ఇక, నా వ్యక్తిగత జీవితంపై కామెంట్స్ చేశారు.. నేను తుడిచేసుకుని పోయే వ్యక్తిని కాదు.. ఆత్మాభిమానం గల వాడిని అన్నారు జూపల్లి కృష్ణారావు… ప్రస్తుతం తాను టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేసిన ఆయన.. తాను కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరుతాననేది ఊహాగానాలు మాత్రమే అన్నారు. ఈ రోజుకు తాను టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు.. కాగా, జూపల్లి కృష్ణారావు ఇంటి ముందు చర్చకు సిద్ధమని సవాల్ చేశారు ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి.. దానిపై జిల్లా ఎస్పీకి దరఖాస్తు చేసుకోవడం చర్చకు దారితీసింది.. మరోవైపు, ఇద్దరు నేతలు చర్చకు సిద్ధం అవుతున్నారు.. సవాళ్లు, ప్రతిసవాళ్ల ప్రకారం రేపు అంటే ఈ నెల 26వ తేదీన చర్చ జరగాల్సి ఉంది.. దీంతో ఏం జరగబోతోంది? అనేది ఉత్కంఠగా మారింది. జూపల్లి కొల్లాపూర్ వెళ్లడానికి సిద్ధం అవుతుండగా.. మరి ఎమ్మెల్యే వస్తారా? పోలీసుల అనుమతి ఇస్తారా? ముందే ఇద్దరు నేతలను కట్టడి చేస్తారా? అనేది ఉత్కంఠగా మారింది.
తాజావార్తలు
-
Diabetes: షుగర్ కంట్రోల్‌కు ఈ 3 కూరగాయలు బెస్ట్.. నిపుణుల సూచనలు ఇవే
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి అన్యాయం.. రెండో టీ20లో కూడా అదే తప్పు’..
-
Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
-
KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
-
AB de Villiers: ‘నా లైఫ్‌లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్‌మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!