కాంగ్రెస్ లో రాజకీయ నిరుద్యోగులు నల్గొండలో నిరుద్యోగ దీక్షకు వచ్చారు అని నల్గొండ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. అంతా ఒకటే అన్నారు, కానీ వేరు వేరుగా వచ్చారు.. మంత్రి గురించి అలీబాబా బృందం మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని భూపాల్ రెడ్ది ఎద్దేవా చేశారు.
ప్రస్తుతం తాను టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేశారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు.. తాను కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరుతాననేది ఊహాగానాలు మాత్రమే అన్నారు. ఈ రోజుకు తాను టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని వ్యాఖ్యానించారు