NTV Telugu Site icon

KCR: అసెంబ్లీ వద్ద సందడి.. గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణస్వీకారం

Kcr

Kcr

KCR: తెలంగాణ మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావు తుంటికి ఆపరేషన్ నుంచి కోలుకుని ఈరోజు తెలంగాణ శాసనసభకు వచ్చారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్‌ ఛాంబర్‌లో శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌తో కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అసెంబ్లీ ఆవరణలోని ప్రతిపక్ష నేత ఛాంబర్‌లో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించి బీఆర్‌ఎల్పీ నేతగా బాధ్యతలు స్వీకరించారు. ఈరోజు మంచిరోజు కావడంతో కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాలన్నారు. బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు కేసీఆర్. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా శాసనసభకు వచ్చారు. కాగా..ఇదే రోజు కేసీఆర్‌ను బీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో తెలంగాణ శాసనసభలో ప్రతిపక్షనేతగా కె.చంద్రశేఖర్ కొనసాగుతారని స్పష్టమైంది.

Read also: Vijay Thalapathy : త్వరలోనే విజయ్ దళపతి పొలిటికల్ ఎంట్రీ..పార్టీ పేరు పిక్స్?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన డిసెంబర్ 3న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రెండు దఫాలుగా అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ఈసారి 39 సీట్లకే పరిమితమైంది. 64 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి రాగా, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో అధిక శాతం మంది అదే నెల 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రమాణ స్వీకారానికి ఒకరోజు ముందు ప్రమాదవశాత్తూ కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో కాలు జారి పడ్డారు. ఈ ప్రమాదంలో ఎడమ కాలులో తుంటి ఎముక విరగడంతో ఆస్పత్రిలో చేరాడు. ఆ తర్వాత కాలికి శస్త్ర చికిత్స చేయించుకుని.. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసే అవకాశాన్ని కోల్పోయారు. తాజాగా ఆయన కోలుకుని రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఆయన అసెంబ్లీకి వచ్చి ప్రమాణం చేశారు. తాజాగా ఆ పార్టీ ఎంపీలతో కేసీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడే ఏకైక శక్తి బీఆర్‌ఎస్ పార్టీ అని, రానున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ హక్కుల సాధన కోసం బీఆర్‌ఎస్ ఎంపీలు గళం విప్పాలని కేసీఆర్ ఆదేశించారు. ఇటీవలే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడంతో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటున్నారు.

YSRCP: ఒంగోలు ఎంపీ స్థానానికి దాదాపు అభ్యర్థి పేరు ఖరారు.. ఆయనే ఫైనల్..!