ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో వ్యవసాయ పనులు చేసుకునేందుకు మాజీ సీఎం కేసీఆర్ సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం వంటిమామిడిలో ఉన్న ఎరువుల షాప్ యజమానికి మాజీ సీఎం కేసీఆర్ ఫోన్ చేసినట్లు సమాచారం. అయితే మొదట నిజంగానే కేసీఆర్ తనకు కాల్ చేశాడా? అనే అనుమానం వచ్చింది. నిజంగానే మాజీ సీఎం కేసీఆర్ మాటలు వినపడటంతో ఖంగు తిన్నాడు. సార్ చెప్పండి అంటూ ఫోన్ పట్టుకుని మాట్లాడగా.. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు విత్తనాలు, ఎరువులు పంపించాలని చెప్పారు. పది రోజుల్లో ఫామ్ హౌస్‌కి వస్తానని చెప్పారు. అంతేకాకుండా.. వ్యవసాయం చూసుకుంటానని తెలిపారు. ఎరువుల యజమాని మాజీ సీఎం ఆరోగ్యం గురించి వాకబు చేయగా ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. అయితే కేసీఆర్ ఫోన్ కాల్‌తో ఎరువుల యజమాని మాట్లాడటం సంచలనంగా మారింది. కేసీఆర్ ఫోన్ కాల్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
Read also: Harish Rao: ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు ఫోన్.. కారణం ఇదీ..
2023 డిసెంబర్ 8వ తేదీ రాత్రి కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో జారి పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆయనను సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. అదే నెల 9న కేసీఆర్ తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత వాకర్ సాయంతో కేసీఆర్‌ను డాక్టర్లు నడిపించారు. ఆస్పత్రిలో కేసీఆర్‌ను రాజకీయ, సినీ ప్రముఖులు పరామర్శించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్.. నేరుగా బంజారాహిల్స్ నంది నగర్‌లోని తన సొంతింటికి వెళ్ళారు. అక్కడే రెస్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ ఆరోగ్యం కాస్త కుదుపడినట్లు.. ఎరువుల యజమానితో మాట్లాడిన మాటల్లోనే అర్థమవుతుంది. సిద్దిపేటలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కేసీఆర్ వెళ్లాలని, అక్కడే వ్యవసాయ పనులు చేసుకుంటూ గడిపేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. ఏదేమైనా కేసీఆర్ కోలుకుని ఒక రైతుగా మళ్లీ ప్రజల్లోకి రావాలని చూస్తున్నారన్నట మాట.. కేసీఆర్ ను చూసేందుకు తెలంగాణ ప్రజలు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఆముహూర్తం ఎప్పుడు వస్తుందో వేచి చూడాల్సిందే..
Shaun Marsh: ఆస్ట్రేలియా ప్లేయర్ సంచలన నిర్ణయం.. ఫామ్‌లో ఉండగానే..!