Shaun Marsh: ఆస్ట్రేలియా ప్లేయర్ సంచలన నిర్ణయం.. ఫామ్‌లో ఉండగానే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shaun Marsh announces retirement from all forms of cricket: ఆస్ట్రేలియా ఆటగాడు షాన్ మార్ష్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఫామ్‌లో ఉండగానే ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మార్ష్.. ఇప్పుడు అన్ని రకాల క్రికెట్ నుంచి తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్)లో జనవరి 16న సిడ్నీ థండర్స్‌తో జరిగే మ్యాచ్ తనకు చివరిదని షాన్ మార్ష్ తెలిపాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.
మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తరఫున ఆడుతున్న షాన్ మార్ష్ ప్రస్తుతం ఫామ్‌లో ఉన్నాడు. చివరి మ్యాచ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్‌పై 49 బంతుల్లో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అంతేకాదు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా దక్కించుకున్నాడు. మార్ష్ ఈ అనూహ్య నిర్ణయం తీసుకోవడంతో ఫాన్స్ సహా అందరూ షాకయ్యారు. 2001లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేసినప్పుడు మార్ష్ వయసు 17 ఏళ్ల 236 రోజులు. పెర్త్ స్కార్చర్స్ తర్వాత అతను 2019లో రెనెగేడ్స్‌లో చేరాడు.
Also Read
- Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
- Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
- World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో 'గ్రూప్ ఆఫ్ డెత్'గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
Also Read: IPL 2024 Final: ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి.. విజేతగా సన్‌రైజర్స్ హైదరాబాద్!
షాన్ మార్ష్ 2008 నుంచి 2019 వరకు 38 టెస్టులు, 73 వన్డేలు, 15 టీ20లలో ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తంగా 5,293 పరుగులు చేశాడు. టెస్ట్‌లలో 2265, వన్డేలలో 2773, టీ20లలో 255 రన్స్ బాదాడు. 2017-18లో ఆస్ట్రేలియా యాషెస్ విజయంలో మార్ష్ కీలక పాత్ర (రెండు సెంచరీలు) పోషించాడు. 2008-17 మధ్యలోపలు ఐపీఎల్ ఫ్రాంచైజీల తరఫున 71 మ్యాచ్‌లు ఆడిన మార్ష్ 2477 పరుగులు చేశాడు. ప్రస్తుత ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌కు స్వయానా అన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
-
Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
-
Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!