Dubai Dirham: ఎంతైనా నిఘా పెట్టినా.. దొంగ దొరలా మారుతాడా?.. తను చేతివాటాన్ని ఉపయోగించకుండా అస్సలు ఉండతలేదు. తన పనితనాన్ని మరిచిపోతానేమో అని భయం ఏమో.. పోలీసులంటే భయాన్ని మాత్రం ఎప్పుడో మర్చిపోతున్నారు. దొంగతనాలు చేస్తున్న వారికి కఠినంగా శిక్షిస్తున్నా.. అవన్నీ పక్కన పెట్టేస్తున్నారు. సినిమాలు, సోషల్ మీడియాలను ఫాలో అవుతూ మరీ దొంగతనాలు.. దొంగ తనం చేసిన డబ్బులను, వస్తువులను సులుగా తీసుకెలుతుంటారు. ఒక విదేశాలకు వెళ్లే వారి గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఇటు నుంచి వెళ్లే ముందు ఒక ధైర్యం నేను ఏదైనా సరే ఏడు సముద్రాలైనా దాటించేస్తా అన్నట్లు బయలు దేరుతారు. ఇలా ఒకటి కాదు రెండు చాలా సర్లు విదేశీ సిగరెట్లు, గోల్డ్, మాదక ద్రవ్యాలు, డాలర్లు ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో మరెన్నో విమానాశ్రయాలలో రోజూ ఏదో ఒకటి పట్టుకుంటూ వారిని శిక్షిస్తున్నా అవన్నీ పక్కనపెట్టి వీరి దారి మాత్రం దొంగదారే అన్నట్లు ముందుకు సాగుతున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఒక్కరోజులో ఏదో ఒకటి వస్తురూపేనా లేదా డబ్బురూపేనా కస్టమ్స్ అధికారులు పట్టుకుంటూనే ఉంటారు. కానీ దొంగబాబులు మాత్రం లగేజ్‌లలో, హ్యాండ్ బ్యాగులలో, పేస్ట్ రూపేనా, షూష్ లలో ఇలా రకాలుగా దొంగ సొమ్మును తరలించే ప్రయత్నం చేస్తూ అధికారుల చేతికి చిక్కుతుంటారు. ఇలాంటిదే తాజాగా ఇవాల శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో చోటుచేసుకుంది.
Read also: Mud baths: వివాహ భోజనంబు సినిమాను తలపించే సీన్.. మట్టితో యువత స్నానాలు
విదేశీ కరెన్సీని ఎయిర్ పోర్ట్ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుండి దుబాయ్ వెళుతున్న ప్రయాణికుడిపై అనుమానం వచ్చి చెక్ చేయగా.. విదేశీ కరెన్సీ బయటపడింది. పట్టుబడిన దుబాయ్ ధరమ్స్ ( కరెన్సీ విలువ) సుమారు 11 లక్షల విలువ ఉంటుందని, సిఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. దుబాయ్ వెళ్లేందుకు EK(527)విమానానికి టికెట్ ప్రయాణికుడు చేరుకున్నాడు. అతనిపై అనుమానం వచ్చిన అధికారులు లగేజీ బ్యాగ్ ను చెకింగ్ చేయగా.. బ్యాగులో 11 లక్షల విలువచేసే దుబాయ్ ధరమ్స్ గుర్తించారు. కరెన్సీ స్వాధీనం చేసుకున్న సిఐఎస్ఎఫ్ అధికారులు నిందితునితోపాటు కరెన్సీని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు ఆరా తీస్తున్నారు. ఇతనితో వేరే వారు కూడా కుమ్మక్కై ఇలాంటి పనులను చేయిస్తున్నారా? ఇలా ఇదే మొదటి సారినా.. లేక ఇక ముందుకూడా ఇలాంటి పనులు చేసాడా? ఇతనితో ఎవరు చేయిస్తున్నారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
Naveen Case:నవీన్ తల్లిదండ్రుల భావోద్వేగం.. చేతిపై అమ్మ అనే టాటూ చూసి గుర్తుపట్టినం..