Mud baths: ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఇది ఎప్పుడు అంటుంటాం.. వింటుంటాం కూడా.. కానీ ఒకప్పటి ఉపయోగించిన ఇంటిలో, ఇంటి ఆవరణలో వున్నవే మన ఆరోగ్యానికి మంచిదని మనం గమనించం. డబ్బులు పెట్టి మరీ మన ఆరోగ్యానకి ఇవే.. మంచివని భావించి బయటకు వెళ్లి మరీ కొని తెచ్చుకుంటుంటాము. కానీ మన ఇంట్లోనే ఆరోగ్యానికి చిట్కాలు ఉన్నాయనేది మన పూర్వీకులు ఎన్నోసార్లు చెబుతున్న అవి పెడచెవిన పెట్టి దాని గురించి అస్సలు పట్టించుకోము. మన వాడే ప్రతి ఆహార అలవాట్లు, ఇంటి ఆవరణలోనే మనకు సంబందించిన ఆరోగ్యప్రయోజనాలు బోలెడెన్ని ఉన్నాయి. ఉదాహరణ ఒకప్పటి జంధ్యాల సినిమాలు హాస్యానికి ప్రతిరూపాలు. జంధ్యాల సినిమా అంటే చాలు సుత్తి వీరభద్ర రావు, బ్రాహ్మానందం, తప్పక ఉండాల్సిందే. వీరిద్దరి కామెడీ ఇక చక్కపనక్కర్లేదు. సుత్తి వీరభద్ర రావు వివాహ భోజనంబు లో బ్రహ్మీకి ముప్పు తిప్పలు పెట్టే సీన్ కడుపుబ్బ నవ్విస్తాయి. కానీ అందులో ప్రతీదీ ఓ వెరైటీయే. ఆరోగ్యానికి మంచిది అంటూ మట్టి, బురద, గొయ్యితొవ్వి అందులో మెడవరకు ఇసుక పోసి కప్పడం, ఆసనాలు ఇలా ఈ సినిమాలో వెరైటీ సీన్‌తో జంధ్యాల సీన్ కడుపుబ్బ నవ్వించినా ఆ సీన్ లలో వున్న వారిద్దరు చేసే కామెడీ అంతాఇంతాకాదు. ఆరోగ్యానికి మంచిదని మట్టిని ఒళ్లంతా రాసుకుని కూర్చునే ఆ సినిమాలో హైలెట్ అనే చెప్పాలి. ఇలాంటిదే సేమ్ టు సేమ్ ను సీన్ ను మనం సిద్దిపేట జిల్లాలో చూడొచ్చు. ఆరోగ్యానికి మంచి చేసే ఆరోగ్య చిట్కాలను సిద్దిపేట యువత చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా అంటూ వీరిని చూసి అంటున్నారు. ఇంతకీ వీరు చేసిందేమిటో తెలుసా.. మట్టితో స్నానం చేయండి. అవును పరిషాన్ అయినా.. షాక్ అయినా నిజయం ఇదే. మట్టితో స్నానం చేస్తూ వేసవి నుంచి విముక్తికి మీరు చేయండి ఆరోగ్యం పదిలంగా ఉంచుకోండి అంటూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
Read also: Naveen Case:నవీన్ తల్లిదండ్రుల భావోద్వేగం.. చేతిపై అమ్మ అనే టాటూ చూసి గుర్తుపట్టినం..
సిద్దిపేట జిల్లాలోనే ఇప్పుడు ఇది నయా ట్రెండ్ అనే చెప్పాలి. ఆజిల్లాలో మట్టితో స్నానాలు యువత చేస్తున్నారు. బయట దొరికే మన్ను, పుట్ట మన్నును తీసుకుని సిద్దిపేట యువత ఒంటి నిండా పూసుకొని మడ్‌బాత్ చేస్తు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. మట్టిలో గోమూత్రం, కలబంద, తులసీ, వేప, గానుగ, ఉసిరితోపాటు ఇలా 25 రకాల వనమూళికల మిశ్రమాన్ని కలిపి సుమారు 12 గంటల పాటు నానాబెట్టి మడ్ బాత్ చేస్తూ ఆరోగ్యానికి ఇవి ఎంత మేలు చేస్తాయో ప్రజలకు కూడా చప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సిగరెట్లు, మందులు కొడుతూ రోడ్డుపై తిరిగే యువకులను మనం చూస్తూ ఛీ.. ఛీ.. ఇప్పటి యువతే అంత అనుకుంటూ ఛీదరించుకునే ఇప్పటి యువతలో ఇలాంటి వారువుంటారా? అనే ప్రశ్నలకు ప్రజలు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. యువతే .. ప్రజలను కూడా ఇలా చేస్తే ప్రయోజనాలను వివరిస్తున్నారు. ఎండాకాలంలో వేడి నుంచి ఉపశమనం పొందేందుకు మడ్‌బాత్ చాలా ఉపయోగపడుతుంది అంటున్న నిర్వాహకులు చెబుతుంటే అక్కడి ప్రజలకు వీరి బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నారు. యువతతో కలిసి ముందుకు సాగేందుకు స్థానికులు సైతం వస్తున్నారు. ఒళ్లంతా మట్టి పూసుకోవడం ద్వారా ఒకవైపు చల్లదనంతోపాటు ఆరోగ్యం కూడా బాగుంటుందని యువత చెప్పడం స్థానిక ప్రజలే కాదు.. తెలంగాణ రాష్ట్రంలోనే సిద్దిపేట యువత మజాకా అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Warehouse explosion: ముసాపేట గోదాం పేలుడు ఘటనపై యజమాని క్లారిటీ.. మృతుడు నా వద్ద..