Food Poisoning: పాలేరు నవోదయ విద్యాలయంలో ఫుడ్ పాయిజన్.. 40 మంది విద్యార్థులకు అస్వస్థత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Food Poisoning: ఖమ్మంజిల్లా పాలేరులో నవోదయ విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యాలయంలో తిండి తిని సుమారు 40 మంది విద్యార్థి, విద్యార్థినులు తీవ్ర అస్వస్థతతకు లోనయ్యారు. ఒకరి తరువాత అస్వస్థతకు గురికావడంతో.. ఆందోళన చెందిన ఉపాధ్యాయులు హుటాహుటిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. అయితే సంక్రాంతి పండుగకు వెళ్లి తెచ్చకున్న తినుబండారాల వలనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని వారుతెలిపారు. కాగా. దీనిపై విద్యార్థులు నిన్న విద్యాలయంలో వండిన వంట తినడం వల్లనే వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యామని వాపోతున్నారు. నిన్న చికెన్ వండారని అది తిన్నప్పటి నుంచి కడుపులో నొప్పి రావడం, వాంతులు అవడం జరిగిందని స్టూడెంట్స్ తెలిపినట్లు సమచారం.
Read also: Anchor Vishnu Priya: బుల్లితెర యాంకర్ ఇంట విషాదం.. రెస్ట్ ఇన్ పీస్ అమ్మా అంటూ..
Also Read
- Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
- Pakistan Cosmetics : హైదరాబాద్‌లో పాకిస్థాన్ కాస్మెటిక్స్ ముఠా గుట్టురట్టు
- KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
అయితే ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. అస్వస్థతకు గురైన విద్యార్థులను.. విద్యాలయ డార్మిటరీలో చికిత్స అందిస్తున్నట్లు ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు. పిల్లలకు కోలుకుంటున్నారని, ఎటువంటి హానీ లేదని చెబుతున్నారు. అయితే విద్యార్థులు అస్వస్థతకు గురైనా పిల్లల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు ఇంత జరుగుతున్నా మాకు సమచారం ఇవ్వలేదని మండిపడుతున్నారు. పిల్లలకు ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహించాలని, పోలీసులు దీనిపై దృష్టి పెట్టాలని.. ఈఘటనపై దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. సంక్రాంతి పండుగకు తెచ్చుకున్న తిను బండారాలు ఒక్కరు తింటే అందరు విద్యార్థులు అస్వస్థలకు ఎలా గురయ్యారో విద్యాలయ యాజమాన్యం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు అక్కడకు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Weather Forecast: ఉదయం చలి.. మధ్యాహ్నం వేడి.. ఏమిటీ పరిస్థితి..
తాజావార్తలు
-
High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
-
Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
-
BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
-
Pakistan Cosmetics : హైదరాబాద్‌లో పాకిస్థాన్ కాస్మెటిక్స్ ముఠా గుట్టురట్టు
-
Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!