అసెంబ్లీలో సీపీఐ ప్రవేశం ఉండాలి… ఆ లక్ష్యంగా పని చేయాలని ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు.. సీపీఐ శ్రేణులు పునరుత్తేజంతో పని చేయాలని సూచించారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలోనే టీఆర్ఎస్ తో కలిశాం.. సమస్యలు ఎక్కడ ఉంటే సీపీఐ అక్కడ ఉంటుంది.. రాష్ట్రంలో అనేక వర్గాలు సమస్యలతో సతమతమవుతున్నాయి.. అధికార పార్టీకి మద్దతు ఇచ్చినంత మాత్రాన ఉద్యమాలు, పోరాటాల్లో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.. ఇటీవల జరిగిన ఘటనలో పురుష దూరహంకారం కనిపిస్తోంది.. మహిళలపైనే ఎందుకు వ్యభిచారం కేసులు పెడుతున్నారు.. ఇద్దరు కలిస్తేనే తప్పు జరిగినట్లు.. ఆడవారికి శిరోముండనం చేసిన వారిని ప్రశ్నించాలన్నారు సాంబశివరావు.
Read Also: Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. కొత్త పథకం ద్వారా 9.75 లక్షల ఉద్యోగాలు..!
ఇక, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య పై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కూనంనేని… బీజేపీ అధ్యక్షుడు క్షమాపణలు చెప్పే వరకు ప్రతీ గ్రామంలో నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.. మరోవైపు.. గవర్నర్ వ్యవస్థ రద్దు చేయాలని సీపీఐ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోందన్న ఆయన.. ఒకవేళ గవర్నర్ వ్యవస్థ ఉంటే మంత్రివర్గ నిర్ణయాలను తప్పకుండా అమలు చేయాల్సిందే అన్నారు.. ఇప్పుడు కొన్ని రాష్టాల్లో గవర్నర్ వ్యవస్థ ఏ విధంగా ఉందో అందరూ చూస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ఉచితాలు, సబ్సిడీ ఎత్తివేయాలని కుహనా మేధావులు డిమాండ్ చేస్తున్నారని మండిపడ్డారు.. ఇక, మిలిటెంట్ పోరాటాలకు అందరూ సిద్ధంగా ఉండాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.. అసెంబ్లీలో సీపీఐ ప్రవేశం ఉండాలి… ఆ లక్ష్యంగా పని చేయాలని.. రాష్ట్రంలో సీపీఐ బలంగా ఉన్న సుమారు 30 నియోజకవర్గాలపై దృష్టి సారించనున్నట్టు వెల్లడించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు.