Traffic Pending Challans: త్వరపడండి.. మిగిలింది 5 రోజులే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాహనదారుల అప్రమత్తం కండి… భారీ డిస్కౌంట్ల ఆఫర్ త్వరలోనే ముగియనుంది.. మరో ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉంది.. తెలంగాణ ప్రజలపై పెండింగ్ చలానా వాహనదారులపై ఆర్థిక భారం తగ్గించడానికి పోలీస్ శాఖ భారీ డిస్కౌంట్లను ప్రకటించిన విషయం తెలిసిందే.. మీరు ఊళ్లో లేకపోయినా సరే.. ఆన్లైన్లో అయినా పెండింగ్ ఛలానాలు చెల్లించమంటున్నారు పోలీస్ అధికారులు. రాయితీ వర్తింపు గడువులోగా చలాన్లు క్లియర్ చేసుకోలేకపోతే తర్వాత భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పెండింగ్ చలాన్ అమలులోకి రాగానే.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని వాహనదారుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. దాదాపు 650 కోట్లకు పైగా విలువైన చలాన్స్ క్లియర్ అయ్యాయి. ఇందులో రాయితీ పొగ 190 కోట్లు ప్రభుత్వ ఖజానా కు వచ్చి చేరాయి. ఇప్పటి వరకు కోటి 85 లక్షల ఛలన్లు క్లియర్ అయ్యాయనీ నగర్ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
Read Also: Birbhum: బీర్భూమ్ ఘటనలో కీలక పరిణామం..
Also Read
- Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
- Engineering College fees: "అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు".. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
ఇదిలా ఉండగా రోజుకు ఏడు నుండి పది లక్షల వరకు చలాన్లు క్లియర్ అవుతున్నాయి. మార్చి 31 వరకే ఈ అవకాశం ఉంటుంది. సద్వినియోగం చేసుకోవాలనీ పోలీసులు సూచిస్తున్నారు. ఇప్పటికి అయితే గడువు పొడిగింపు ఆలోచన లేదన్నారు నగర జాయింట్ ట్రాఫిక్ సీపీ.. ఇప్పటి వరకు 15 వందల కోట్ల విలువ చేసే… చలాన్ల పెండింగ్ ఉన్నాయి. 60 నుండి 70 శాతం క్లియర్ అవుతాయని ఆశిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. గడువు సమయం తర్వాత ట్రాఫిక్ రూల్స్ వయిలెట్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయనీ పోలీస్ అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో హైయెస్ట్ చాలన్లు క్లియర్ అయ్యాయి. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారిపై ఛార్జ్ షీట్ లు వేస్తామన్నారు. ఏప్రిల్ నుండి ట్రాఫిక్ రూల్స్ ఉలంఘిస్తే… చార్జ్ షీట్ లు వేస్తాం అనీ తెలిపారు. కోవిడ్ కారణాలతో గ్యాప్ ఇచ్చామనీ.. తిరిగి మునుపటి లాగే కేసులు నమోదు చేసి జైళ్లకు పంపుతామన్నారు. ఈ డిస్కౌంట్ ఆఫర్ ముగిసిన తర్వాత ఇలాగే పెండింగ్ చలనాలు ఉన్నవారినీ గుర్తించి చార్జిషీట్లు వేసి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి చలానాలు తొందరగా క్లియర్ చేసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా.. మరో ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్న ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకుంటే.. డబ్బులు మిగలడంతో పాటు.. ఇతర ఇబ్బందులు కూడా తొలగిపోనున్నాయి.. మరెందుకు ఆలస్యం.. ఇప్పుడే.. ఆన్లైన్లో మీ పెండింగ్ చలాన్లు క్లియర్ చేయండి.
తాజావార్తలు
-
GDN : సైలెంటుగా తెలుగులోకి మాధవన్ G D నాయుడు
-
Sheikh Hasina: “నరహంతకురాలు”.. షేక్ హసీనా స్పీచ్‌పై బంగ్లాదేశ్ ఆగ్రహం..
-
Retirement Age: ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పదవీ విరమణ వయస్సు పెంపు..
-
Iran: సుప్రీం లీడర్‌తో మాట్లాడటం కష్టమే.. ఇరాన్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
Uttar Pradesh: గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు మృతి.. జైలులో ఉన్న అన్నను కలిసేందుకు వెళ్తూ..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!