Fire Accident: మంచిర్యాలలో ఘోర అగ్నిప్రమాదం.. 6మంది సజీవదహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
fire accident in manchiryala: మంచిర్యాల జిల్లా మందమర్రి మం వెంకటాపూర్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి ఓ ఇంట్లో మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనం అయ్యారు. మృతుల్లో ఇంటి యజమాని శివయ్య (50), ఆయన భార్య పద్మ(45), పద్మ అక్క కూతురు మౌనిక (23), ఆమె ఇద్దరు కుమార్తెలు హిమ బిందు (2), స్వీటీ (4), సింగరేణి ఉద్యోగి శాంతయ్య ఉన్నట్లు గుర్తించారు. స్థానిక సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. ఈఘటనలో 6మంది సజీవదహనం అయ్యారు. ఈప్రమాదానికి గల కారణాలపై డీసీపీ అఖిల్ మహాజన్ ఆరా తీశారు. ఇంట్లో షార్ట్ షర్య్కూట్ తో ఇలా జరిగిందా లేక ఎవరైనా ఈఘాతుకానికి పాల్పడ్డారా అనే కోణంలో విచారణ చేపట్టారు. అయితే మాసు శివయ్య భార్యతో సింగరేణి ఉద్యోగి శాంతయ్య ఉన్నట్లు అక్రమ సంబంధం ఉన్న వ్యక్తిగా తెలిసింది. ఈవిషయం శివయ్యకు తెలియడంతో.. ఇంట్లో అందరూ పడుకున్న సమయంలో వీరిద్దరిలో ఎవరైనా ఇంటిని తగలబెట్టారా? అనే కోణంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read also: Bhakthi TV Special Live: మార్గశిర శనివారం నాడు ఈ స్తోత్రపారాయణం చేస్తే..
Also Read
అయితే.. చెన్నూరు నియోజకవర్గం, మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 6 గురు మృతి చెందడం పట్ల ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర విచారణ వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఆరుగురు సజీవ దహనం అవడం తమని తీవ్రంగా కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకుంటూ మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు విచారణ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
Govinda Namalu Bhakthi Tv Live: గోవింద నామాలు వింటే…
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్‌న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..