పండగ పూట తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ముగ్గురు అక్కడికిక్కడే సజీవ దహనం అయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సెలవుల నేపథ్యంలో యువకులు చెన్నై నుండి మున్నార్ ట్రిప్ కు వెళుతుండగా ప్రమాదం జరిగింది. విల్లుపురం జిల్లా విక్రవాండి సమీపంలోని జాతీయ రహదారిపై కారు కంట్రోల్ తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో కారులో అకస్మాత్తుగా మంటలు…
త్రిపురలో అమానుష ఘటన వెలుగుచూసింది. నవమాసాలు మోసి కనిపెంచిన కన్నతల్లిని కుమారులే కర్కశంగా సజీవదహనం చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలచివేసింది. పశ్చిమ త్రిపురలోని చంపక్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖమర్‌బారిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
యూపీలోని బదౌన్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో.. డేటాగంజ్-బడాయూన్ రహదారిపై హైటెన్షన్ లైన్ తెగిపడి బైక్‌పై వెళుతున్న దంపతులపై పడింది. దీంతో.. విద్యుత్ ఘాతుకానికి గురై భార్యాభర్తలు అక్కడికక్కడే మరణించారు. బైక్ కూడా పూర్తిగా కాలిపోయింది. ఎలాగోలా ప్రజలు హైటెన్షన్ లైన్‌ను తొలగించారు.
జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మారుమూల గ్రామంలో ఇవాళ తెల్లవారు జామున ఇంటికి మంటలు అంటుకోవడంతో ముగ్గురు మైనర్ బాలికలు సజీవదహనం అయ్యారని పోలీసు అధికారులు తెలిపారు.
పశ్చిమ లండన్‌లోని హౌన్స్‌లోలో ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు పిల్లలతో సహా భారతీయ సంతతికి చెందిన ఐదుగురు వ్యక్తులు మరణించారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.