Funeral Poster: ఓ తండ్రి తన కూతురిని కంటిరెప్పలా చూసుకున్నాడు. రెప్పపడితే తన కూతురికి ఏం జరుగుతుందో అంటూ రాత్రి పగలు అని తేడాలేకుండా ఆలనా పాలనా చూసుకున్నాడు. తల్లి 9నెలలు కడుపున మోస్తే కూతురిపై తండ్రి ప్రేమ విశ్వమైందని చాటాడు. అయితే తన కూతురు తనకు ఇష్టం లేని పని చేసిందని ఆ తండ్రి గుండె పగిలింది. దీంతో తండ్రి ఓ ప్లెక్సీని ఏర్పాటు చేశాడు. తన కూతురు చనిపోయిందంటూ ఏకంగా తన ఇంటి ముందే తన కూతురి శ్రద్దాంజలి ఫెక్సీ పెట్టి కన్నీరుమున్నీరుగా విలపించాడు. సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేసి బంధువులందరికీ తన కూతురు చనిపోయిందని పిండ ప్రదానాలు చేశాడు. తీవ్ర మనస్థాపానికి గురైన ఆ తండ్రి..చేసిన పని సర్వత్రా చర్చనీయాంశమై నెట్టింట వైరల్‌గా మారింది. ఈఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.
Read also: Botsa Satyanarayana: పీకేకు బొత్స కౌంటర్.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు..!
రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిలువేరి అనూష అనే యువతి కుటుంబం నివాసం ఉంటుంది. అనూష ఇంటర్ చదువుకుంటుంది. అయితే కొద్దిరోజులుగా అనూష ఓ యువకుడిని ప్రేమలో పడింది. ఆ విషయం ఇంట్లో వాళ్లకు తెలిస్తే ఏమి జరుగుతుందో అనే భయంతో ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంది. అయితే బయటకు వెళ్లిన అనూష ఎంతకూ ఇంటికి రాకపోవడంతో భయంతో తల్లిదండ్రులు బంధువులకు, మిత్రులకు ఫోన్ చేశారు. అయితే అనూష ఎక్కడికి పోయిందో అంటూ ఆందోళనలో వున్న తల్లిదండ్రులకు షాక్ అయిన వార్త తెలిసింది. అనూష ఓ యువకుడిని పెళ్లిచేసుకుందని తెలిపడంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురియ్యారు. తన కూతురు అలాంటి పనిచేయదని, తనని మభ్యపెట్టి ఆ యువకుడు పెళ్లి చేసుకున్నాడని కన్నీరుమున్నీరుగా విలపించారు.
Read also: KL Rahul: 160 ప్లస్ స్కోరు చేసిన ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించడం బాగుంది: కేఎల్ రాహుల్
తన కూతురు చేసిన పనికి తండ్రి గుండె పగిలింది. దీంతో తండ్రి అందరికి షాక్ ఇచ్చేవిధంగా ఓ ఫ్లెక్సీని ఏర్పటు చేశాడు. అదే తన కూతురు అనూష చనిపోమింది. తనకు శ్రద్దాంజలి ఘటిస్తున్నానని. అందులో పేర్కొన్నాడు. ఆ ఫ్లెక్సీని ఇంటి అరుగుమీద పెట్టి అమ్మా ఎవరు ఇలా చేయకండి.. తల్లిదండ్రులను మోసం చేయకండి అంటూ కుటుంబసభ్యులందరూ ఆ వీడియోలో తెలిపారు. ఆ వీడియో చూసిన వాళ్లందరూ వ్యామోహంతో తల్లిదండ్రుల గురించి ఒక్కనిమిషం కూడా ఆలోచించకుండా ప్రేమ అనే పేరుతో ఇంటిని వదిలి వెళ్లిపోతారు. వాళ్ల ఆనందం కోసం కుటుంబ సభ్యుల గురించి అస్సలు ఆలోచించరు. ఇందుకేనా కడుపున పెట్టుకుని చిన్నప్పటి నుంచి చూసుకున్నదానికి ఫలితం అంటూ.. కొందరు నెటిజన్లు పైర్ అవుతున్నారు. మరి దీనిపై ప్రేమ పెళ్లి చేసుకున్న అనూష దంపతులు ఏం సమాధానం ఇస్తారో.. చూడాలి మరి.
Allu Arjun Birthday : అల్లు అర్జున్ బర్త్ డే పార్టీ.. అదిరిపోయే లుక్ లో స్నేహారెడ్డి..