అటవీ ప్రాంతంలో పంటల్ని కాపాడుకోవడం చాలా కష్టం. ఏనుగులు, ఇతర జంతువులు పంటల మీద పడి వాటిని పాడుచేస్తుంటాయి. ఆరుగాలం శ్రమించిన రైతుకు ఇది అదనపు కష్టం. అందుకే రైతులు తమ పంటల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడానికి అనేక ఆలోచనలు చేస్తుంటాడు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం చోండి గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే రైతు వినూత్న ఆలోచన చేశారు. తనకు ఉన్న 3 ఎకరాలలో పంటను అడవి జంతువుల నుంచి కాపాడుకోవడానికి తనకు వచ్చిన ఆలోచనను అమలుచేశాడు.
Read Also: Kerala Black Magic Case: కేరళ నరబలి కేసులో ట్విస్టులే ట్విస్టులు.. వండుకుని తిన్నది నిజమేనా?
పంటల చేల మధ్యలో వివిధ బొమ్మలు వుంచాడు. మహిళల రూపంలో బొమ్మలు తయారు చేసి గట్లపై పెట్టాడు. ఒక ఆడ బొమ్మ ఒక మగ బొమ్మను తయారు చేసి పంట చేనులో రక్షణగా వుంచారు. పంట చేనులో గట్టు వద్ద రెండు బొమ్మలను ఏర్పాటు చేసిన అప్పటి నుంచి అటవీ జంతువులు రావడం లేదంటున్నాడు రైతు. 3 ఎకరాల్లో పత్తి, సోయా పంటసాగు చేస్తున్నానని రైతు తెలిపాడు. పంట వేసిన నుంచి అటవీ జంతువుల బెడద బాగా ఉండేదని పంటను కాపాడుకోవడానికి తనకు తోచిన ఆలోచనలతో ఇలా చేసానంటున్నాడు. తన ఆలోచనను ఇతర రైతులు కూడా ఆచరిస్తున్నారన్నాడు ఆ రైతు. ఆ బొమ్మలు కూడా సాదాసీదాగా ఏం తయారుచేయలేదు. అచ్చం మనిషి వచ్చి నిలబడినట్టుగా తయారుచేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడా రైతు.
Read Also: Sourav Ganguly Hot Comments Live: ఒక్కరోజులో మోడీ కాలేరు.. గంగూలీ హాట్ కామెంట్స్