ఉదయాన్నే ఆ ఊరికి చెందిన కొందరు వ్యక్తులు రోడ్డు పక్కన నిలబడి ఆటోలు ఆపుతుంటారు. ఆటో ఆగిన తరువాత ఆటో డ్రైవర్‌తో మాట్లాడుతారు. ఆ తరువాత అందులోని వ్యక్తులను తీసుకొని వెళ్తారు. ఎవరు వారంతా, ఎందుకు తీసుకెళ్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్తారు అనే అనుమానాలు రావొచ్చు. ఆదిలాబాద్ జిల్లాలోని తాంసీ మండలంలో పొన్నారి అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో పత్తిపంట చేతికి వచ్చిన తరువాత పత్తిని తీసేందుకు కూలీల కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదిలాబాద్ చుట్టుపక్కల…