Munugode by Poll: మునుగోడు పోరు.. రెండు పోలింగ్ కేంద్రాల్లో మొరాయించిన ఈవీఎంలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Munugode by Poll: మునుగోడు నియోజక వర్గంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటును వినియోగించుకునేందుకు ఓటింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు బారులు తీరారు. మునుగోడులో ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం పోలింగ్ నమోదైంది. మునుగోడు ఎన్నికల పోలింగ్ సరళిపై బండిసంజయ్ ఆరా తీస్తున్నారు. అయితే.. మర్రిగూడలో బీజేపీ నాయకుల ఆందోళన చేపట్టారు. టీఆర్ఎస్ శ్రేణులు ఓటర్లను మభ్యపెడుతున్నారంటూ బీజేపీ శ్రేణులు ఆరోపించారు. గజ్వేల్ టీఆర్ఎస్ నాయకులు మర్రిగూడలో ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. పోలింగ్ నిలిపివేయాలంటూ పోలీసులతో బీజేపీ శ్రేణులు వ్యాగ్వాదానికి దిగారు. సిద్దపేటకు చెందిన వ్యక్తులను పోలీసులకు బీజేపీ కార్యకర్తలు అప్పగించారు. వీడియోలు తీస్తున్నామనే నెపంతో బీజేపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. బీజేపీ శ్రేణులు అరెస్టును నిరసిస్తూ ఆందోళనకు దిగారు కార్యకర్తలు. దీంతో అక్కడు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వారిపై లాఠీ చార్జ్ చేసి అక్కడనుంచి వెల్లగొట్టారు. అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
Read also: Prabhas: మిల్కీబ్యూటీని ఆట ఆడిస్తున్న ప్రభాస్.. వైరలవుతున్న వీడియో
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- University of London Hyderabad Campus: హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Hyderabad Food Safety Raids: బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
- Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
మునుగోడులో కొంపల్లి 145వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం లు మొరాయించాయి. 25 ఓట్లు పోలయ్యాక ఈవీఎంలో సాంకేతిక సమస్య ఎదురైంది. ఈవీఎం మొరాయింపుతో గంటనుంచి పోలింగ్ నిలిచింది. ఇక చండూరులో స్వల్ప ఉద్రిక్తత స్థానికేతరులు చండూరులోని ఓ ఇంట్లో ఉన్నారని గుర్తించిన బీజేపీ శ్రేణులు ఘటనాస్థలికి వెల్లడంతో స్థానికేతరులు పరారయ్యారని బీజేపీ శ్రేణులు ఆరోపించారు. అదే సమయంలో ఘటనా స్థలికి వెళ్లిన టీఆర్ఎస్ కార్యకర్తులు వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. అక్కడ చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. మునుగోడు నియోజక వర్గం నారాయణపురం పరిధి లింగవారిగూడెంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓటువేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మునుగోడు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. నల్గొండ చండూరు మండలంలో ఇడికూడలో 173వ పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
తాజావార్తలు
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!