అధికారపార్టీ టీఆర్ఎస్ నుండి బీజేపీ కి వలసల పర్వం కొనసాగుతోంది. మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే గా రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 21 న బీజేపీలో చేరేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఆయనకు మద్దతుగా మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరుతున్నారు. ఇంకా ఉప ఎన్నిక రాకముందే బీజేపీ నేతలు ఆపరేషన్ ఆకర్ష్ మంత్రం విరివిగా ప్రయోగిస్తున్నారు.
Read Also: Shamshabad Airport: డీజీ యాత్ర యాప్.. ఆ కష్టాలకు ఇక చెక్
చండూర్ మండల సర్పంచ్ లు..తిప్పర్తి దేవేందర్ ధోనిపాముల గ్రామం, నందికొండ నర్సిరెడ్డి , నేర్మట గ్రామం, చొప్పరి అనురాధ వెంకన్న, చొప్పరివారిగూడెం గ్రామం, కురుపాటి సైదులు, తుమ్మలపల్లి గ్రామం, మెండు ద్రౌపది వెంకట్ రెడ్డి, కస్తాల గ్రామం నుంచి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మునుగోడు మండల సర్పంచ్ కర్నాటి ఊషయ్యలు బీజేపీలో చేరారు.
బీజేపీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో వీరంతా బీజేపీలో చేరారు. మునుగోడు రాజగోపాల్ రెడ్డి గెలుపు తథ్యం అంటున్నారు. అధికార పార్టీ నుండి ప్రతిపక్షంలోకి ప్రజాప్రతినిధులు వచ్చి చేరుతున్నారు అంటే కెసిఆర్ పాలనపట్ల వారికి ఎంత వెగటుపుట్టింది అర్థం చేసుకోవచ్చు అని ఈటల రాజేందర్ అన్నారు. కెసిఆర్ కి హుజూరాబాద్ లాంటి తీర్పు మరోసారి రుచిచూడబోతున్నారు అని ఈటల రాజేందర్ అన్నారు.
Read Also: Goa: మైనర్ బాలిక కిడ్నాప్, లైంగికదాడి.. యూపీలో యువతిని బెదిరించి..