Etela Rajender: రాజగోపాల్ రెడ్డి ఎలా మాట మార్చారు..? హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. రాజ గోపాల్ రెడ్డి రాజీనామా చేయాల్సింది కాదని తెలిపారు. రాజకీయాల్లో రాజ గోపాల్ రెడ్డి సీనియర్ నాయకులని అన్నారు. పార్టీ మారె ముందు అలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుండేది కాదని తెలిపారు. మొన్ననే బీఆరెస్ కు.. బీజేపీయే ప్రత్యామ్నాయమని చెప్పిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఎలా మాట మార్చారు? అని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఇంకా చదవలేదన్నారు. మరోవైపు మంత్రి కేటీఆర్ కు ఈటెల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. హుజురాబాద్ లోనే కాదు గజ్వెల్ లో కూడా ఈటెల గెలవబోతున్నానని తెలిపారు. ఎవరి బలం ఎంత అనేది ఎన్నికల్లో తేలిపోతుందని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ డబ్బు సంచులను నమ్ముకుందన్నారు. హుజురాబాద్, గజ్వేల్ రెండు చోట్లా నేనే గెలుస్తానని తెలిపారు. తాటాకు చప్పుళ్లకు భయపడనని ఈటెల రాజేందర్ అన్నారు.
హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రేపు గజ్వేల్ కు రానున్నారు. గజ్వేల్ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆయన మొదటిసారి నియోజకవర్గానికి రానున్నారు. దీంతో ఆయనకి భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒంటి మామిడి నుంచి గజ్వేల్ కోట మైసమ్మ ఆలయం వరకు బీజేపీ నిర్వహించే ర్యాలీలో ఈటెల రాజేందర్ పాల్గొననున్నారు. ముట్రాజ్ పల్లిలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అయితే, ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీ పార్టీలోకి గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్, బీఆర్ఎస్ అసంతృప్త నాయకులు చేరనున్నారు. ఈటల ఆలోచనలకు తగ్గట్టుగానే బీజేపీ అధిష్టానం ఆయనను హుజూరాబాద్ తో పాటు గజ్వేల్ నుంచి కూడా ఎన్నికల్లో పోటీ చేసే విధంగా టికెట్ కేటాయించింది. ఇక, ఈ ఎన్నికల్లో కేసీఆర్ ని తాను ఓడించడం ఖాయమని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని పరిస్థితులను బాగానే అధ్యయనం చేశానని ఆయన తెలిపారు. కాగా, తెలంగాణలో హ్యాట్రిక్ విజయం సాధించాలని కేసీఆర్ ఈసారి ఎన్నికలలో గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ నేపధ్యంలో ఈటల రాజేందర్ కూడా హుజూరాబాద్- గజ్వేల్ నుండి పోటీ చేస్తున్నారు.
Komatireddy Venkat Reddy: వారి నిర్ణయమే ఫైనల్.. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ చేరికపై కోమటి రెడ్డి క్లారిటీ