Site icon NTV Telugu

Etela Rajender : రెండు పార్టీలకు ఓట్లు అడిగే ముఖం లేదు.. అభ్యర్థులను పెట్టే దమ్ములేదు

Etela

Etela

తెలంగాణలో ఈ నెల 27న గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరుగనున్నది. రాష్ట్రంలోని అధికార విపక్ష పార్టీలు ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలకు ఓట్లు అడిగే ముఖం లేదు.అభ్యర్థులను పెట్టే దమ్ములేదని అన్నారు. ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు రాయితీలు ఇస్తున్నారు. అబ్దుల్ కలాంను అవమానించిన అమెరికా స్థాయి నుంచి మోడీని గౌరవించిన తీరుకు మనం చూస్తున్నాం. ఇది మోదీ విజయం అని ఈటెల తెలిపారు.

Also Read:Bandi Sanjay : ఐఏఎస్‌లను తప్పు చేయాలని ముఖ్యమంత్రే అంటారా..?

ఇప్పుడు స్కాములు లేవు.. మంత్రులు జైళ్లకు పోవడం లేదు. సుపరిపాలన అందిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా కొన్ని సీట్లు ఇస్తే బాగుండు అనే భావన ప్రజల్లో బలంగా పెరిగింది. కాబట్టే.. మహారాష్ట్ర హర్యానా డిల్లీలో బీజేపీని గెలిపించారు. టీచర్లకు అన్నివేళలా అండగా ఉన్నది బీజేపీ. 317 జీఓ కి వ్యతిరేకంగా కొట్లాడింది బీజేపీ. 317 జీఓ వల్ల టీచర్లు ఆత్మహత్యలు చేసుకున్నా కెసిఆర్ పట్టించుకోలేదన్నారు.పదవీ విరమణ డబ్బులు రావాలంటే 10 శాతం లంచం ఇవ్వాల్సిన దుస్థితి నెలకొంది. దాచుకున్న డబ్బులు ఇవ్వమంటే దిక్కులేదు.

Also Read:Device Tokenization Solution: ఫోన్ పే కొత్త ఫీచర్.. యూజర్లకు ఇక ఆ ఇబ్బందులుండవ్

ఐదు డి.ఏ లు పెండింగ్, 371 బాధలు పోలేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. విద్యావ్యవస్థ నాశనం అయ్యింది. ప్రైవేట్ కాలేజీలో ఫీజు రీయింబర్స్ మెంట్ కెసిఆర్ మూడేళ్లు.. రేవంత్ ఇప్పుడు సంవత్సరన్నరగా పెండింగ్ పెట్టారు. డబ్బులు విడుదల చేయమంటే రేవంత్ సెటిల్మెంట్ కి రమ్మంటున్నారట. ఇంతకంటే నీచం ఏమన్నా ఉందా ? అని ఈటెల ప్రశ్నించారు. నిధులు విడుదల చేయకపోవడంతో కాలేజీలు నడపలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకే మూకుమ్మడిగా బీజేపీకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ఈటెల వెల్లడించారు.

Exit mobile version