హైదరాబాద్ నగర మొదటి మేయర్ కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి ఉత్సవాలు బోయాగూడలోని ముదిరాజ్ భవన్లో ఘనంగా జరిగాయి. మేయర్ గా కృష్ణస్వామి ముదిరాజ్ చేసిన సేవలను పలువురు గుర్తుచేశారు. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పుట్టిన రోజు కూడా ఈరోజే అవ్వడంతో బోయగూడలో ఆయన్ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కాసాని జ్ఞానేశ్వర్ ని గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ముదిరాజ్ భవన్ కి ఈటల వచ్చి కాసానిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడంతో ముదిరాజుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ అక్కడ పెద్దఎత్తున నినాదాలు చేశారు.
Read Also: Godavari Flood Down: తగ్గుతున్న గోదావరి వరద.. వీడని లంక వాసుల కష్టాలు
తమ జాతికి చెందిన ఇద్దరు ముఖ్యనేతలు కలిసిపోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ కే తమ మద్దతు అంటూ నినాదాలు చేశారు. కాసాని-ఈటల కాసేపు మాట్లాడుకున్నారు. ఇద్దరు నేతల కలయికతో ముదిరాజ్ భవనలో సందడి వాతావరణం నెలకొంది. జై ఈటల.. కాబోయే సీఎం రాజన్న అంటూ నినాదాలు చేశారు కార్యకర్తలు. ఒకవైపు తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కిన వేళ ఈటల రాజేందర్ వివిధ పార్టీల నేతల్ని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారు. అనంతరం బిజెపి రాష్ట్ర కార్యాలయం లో ఈటల మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో మతి లేని పాలన సాగుతోందన్నారు. జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేనప్పుడు కాళేశ్వరం కట్టిన తీరు దారుణం అన్నారు. రాబోయే కాలంలో ముంపునకు గురికాకుండా కాళేశ్వరం విషయంలో నిపుణులతో కమిటీ వేయాలన్నారు.
Read Also: Paderu Agency Child Deaths: పాడేరు ఏజెన్సీలో చిన్నారుల మిస్టరీ మరణాలు