Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Etela Rajender At Kakatiya University Student Unions Maha Deeksha

మానవ సంపద నిర్వీర్యం కావడం మంచిది కాదు..

Published Date :September 22, 2021 , 4:40 pm
By Sudhakar Ravula
మానవ సంపద నిర్వీర్యం కావడం మంచిది కాదు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

మానవ సంపద నిర్వీర్యం కావడం తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్… హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల మహాదీక్షకు మద్దతు తెలిపిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2009 కేసీఆర్ దీక్ష విరమణ జరిగిన వార్త కేయూ 2వ గేటు వద్ద విన్నాను.. నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ ఉద్యమం జరిగింది. విద్యార్థి లోకం జాక్ గా ఏర్పడి దీక్షలు చేశారని గుర్తుచేశారు.. ఇక, మానవ సంపద నిర్వీర్యం కావడం రాష్ట్రానికి మంచిదికాదన్న ఆయన.. హుజురాబాద్‌లో ఎలా దౌర్జన్యం చేయాలి..? ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాలి అనేదే టీఆర్ఎస్‌ ఆలోచన అని మండిపడ్డారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆశించిన దిశగా సాగడంలేదన్న ఆయన.. విద్యార్థులకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన ఎందుకు వస్తుందో పాలకులు ఒకసారి ఆలోచించాలన్నారు.

మన రాష్ట్రంలో ఎన్నికల కోసమే కొన్ని పథకాలు తీసుకువస్తారు అని ఎద్దేవా చేశారు ఈటల రాజేందర్.. ఏ రోజు అంబేద్కర్ జయంతికి పూల మాల కూడా వేయని కేసీఆర్.. కేవలం హుజురాబాద్ ఎన్నికల కోసమే దళితబంధు స్కీం తీసుకొచ్చారని విమర్శించారు. గొల్ల కురుమల కోసం తీసుకొచ్చిన గొర్రెల పంపిణీ కూడా బ్రోకర్ల చేతికి వెళ్లింది.. మేధావులు ఈ లెక్క తేల్చాలన్న ఆయన.. విద్యార్థులు చేసే ఉద్యమాలకు ప్రజల మద్దతు ఉంటుందన్నారు.. పిడికెడు మంది చేతుల్లో ఈ దేశ సంపద బందీ అయ్యిందని ఆవేదన వ్యక్తం చేసిన ఈటల.. విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను నియమించుకోవాల్సిన దౌర్భాగ్యం పట్టిందన్నారు. హుజురాబాద్ లో ఎలా గెలవాలి అనే ఆలోచన తప్ప విద్యార్థులకు మంచి చేయాలనే ఈ సర్కార్ కు లేదని మండిపడ్డ మాజీ మంత్రి.. 20వ తేదీ వచ్చినా ముసలి తల్లులకు పెన్షన్ కూడా ఇవ్వలేని దుస్థితి మన ధనిక రాష్ట్రంలో వచ్చిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఆకలినైన బరిస్తది కానీ ఆత్మగౌరవం కోల్పోదన్న ఆయన.. విద్యార్థులు చేసే న్యాయపరమైన పోరాటాలకు నా మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.. హుజురాబాద్ ఎన్నిక కేసీఆర్ అహంకారాన్ని కూల్చే ఎన్నిక కావాలని పిలుపునిచ్చిన ఈటల.. తెలంగాణ ఆకాంక్షలను ప్రతిబింబించే ఎన్నిక హుజురాబాద్ కావాలన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • Etela Rajender
  • Kakatiya University
  • Student Deeksha
  • Student Unions Maha Deeksha

తాజావార్తలు

  • Aditya Dhar : దటీజ్ ప్రభాస్.. ది లెజెండ్..

  • HIV Injection Case: పెళ్లికి నిరాకరించిన ప్రియురాలికి HIV ఇంజెక్షన్‌ ఇచ్చిన ప్రియుడు.. అవమానంతో యువతి..

  • Rayalaseema Water Project Row: చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు చిత్తశుద్ధి ఏది..? సీమవాసులు మీకు పట్టం కడితే.. చేస్తున్నది ఏంటి?

  • Fuel Price Hike: యుద్ధం ఎఫెక్ట్.. వరుసగా నాల్గోసారి పెరిగిన పెట్రో ధరలు.. పెట్రోల్‌పై రూ.17, డీజిల్‌పై రూ.25 వడ్డింపు

  • Justice Yashwant Varma Resigns: సంచలన నిర్ణయం.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా

ట్రెండింగ్‌

  • AI Impact on Jobs: ఆంత్రోపిక్ షాకింగ్ రిపోర్ట్.. కోడింగ్ నుంచి సేల్స్ వరకు ఈ టాప్ 10 కెరీర్లు ముగిసినట్టే..!

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions