Video Viral: ఛా.. ఈ ట్రిక్ తెలియక ఇప్పటికి ఎన్నోసార్లు ఫైన్ కట్టానో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Video Viral: ఈ మధ్య ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ట్రాఫిక్ పోలీసులు విధించే జరిమానాలు భారీగా ఉన్నాయి. అసలు వాహనంలో ప్రయాణించడం కంటే ప్రభుత్వం నడిపే బస్సుల్లో ప్రయాణించడం మంచిదని వాహనదారులు ఆలోచిస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త జరిమానాలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. వెరైటీ శిక్ష మధ్యప్రదేశ్‌లో కొద్దిరోజుల క్రితం పోర్షే లగ్జరీ కారును రూ. 30 లక్షలు జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా వెలుగుచూశాయి. అంతేకాదు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిచిన వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు వెరైటీ పనిష్మెంట్ ఇస్తుంటారు. అయితే.. హెల్మెట్ లేకుండా బైక్ నడపడం చట్ట విరుద్ధమే.. అయినా కూడా చాలా మంది హెల్మెట్ లేకుండా బైక్ జర్నీ చేస్తుంటారు. హఠాత్తుగా పోలీసులు కనిపించినప్పుడు, వారు జరిమానాల నుంచి తప్పించేకునేందుకు రకరకాల ట్రిక్కులు ఉపయోగిస్తుంటారు.
Read also: Shirdi Tour: షిర్డీ వెళ్లే యాత్రికులకు తెలంగాణ సర్కార్ అదిరే ఆఫర్
Also Read
- Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
బైక్ పై వెళుతున్న ఇద్దరు యువకులు ఇలాంటి ఐడియానే ఉపయోగించారు. ఇద్దరు బైక్ పై వెళుతున్నారు. బైక్ నడిపే యువకుడికి హెల్మెట్ లేదు అయినా స్కూటర్ నడుపుతున్నాడు. ఇంతలోనే రోడ్డుపై ట్రాఫిక్ పోలీసులను చూశాడు. దీంతో ఆ యువకుడు ఓ ట్రిక్ ఉపయోగించి పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ట్రాఫిక్ పోలీసుల ఎదురు నుంచి హెల్మెట్ లేకుండా తప్పించుకున్నాడా! అది ఎలా?. హెల్మెట్ లేకుండా బైక్ నడపడం చట్టవిరుద్ధమే.. కానీ బైక్ నెట్టడం కాదకదా!. పోలీసులను చూసిన ఆ యువకుడు స్కూటర్ దిగి సూటీని తోసుకుంటూ ముందుకు వెళ్లాడు. అయితే ఆ యువకుడు పోలీసుల ముందునుంచి బైక్‌ను తోసుకుంటూ పోవడం వల్ల బైక్ లో పెట్రోల్ అయిపోయిందేమో అందుకే ఆ యువకుడు బైక్ ను తోసుకుంటూ వెళుతున్నాడని పోలీసులు పట్టించుకోలేదు. పోలీసులను దాటిన తర్వాత బాలుడు స్కూటీని స్టార్ట్ చేసి వేగంగా వెళ్లిపోయాడు. అయితే వెళుతున్న యువకుడ్ని బండిలో పెట్రోల్ అయిపోయిందా? అంటూ వెనుకనుంచి వస్తున్న వ్యక్తి అడుగుతుంటే నవ్వుతో కనుసన్నతో పోలీసులను చూపిస్తూ చిరునవ్వులు చిందిస్తూ ముందుకు సాగాడు. అయితే.. రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోను ఇప్పటి వరకు సుమారు 6 కోట్ల మంది వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. “ఎన్ని చట్టాలు చేసినా భారతీయుల తెలివితేటల ముందు తేలిపోతాయి” అని ఒక వ్యక్తి కామెంట్ చేశాడు. “ఛా.. ఈ ట్రిక్ తెలియక ఎన్నో సార్లు ఫైన్ కట్టానో” అని మరొకరు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?