దుబ్బాక భయంతోనే కేసీఆర్ జిల్లాల పర్యటన : రఘనందన్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం కేసీఆర్ పై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. బీజేపీని తిట్టడానికి అధికార వేదికలు వాడుకోవద్దని సూచనలు చేసిన రఘనందన్… కేసీఆర్ భాషను నియంత్రించుకోవాలని సూచించారు. యాక్షన్ కు రియాక్షన్ కూడా వస్తోందని సీఎం కేసీఆర్ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి సంస్కారహీనంగా మాట్లాడటం తెలంగాణ సమాజానికి సిగ్గుచేటు అని.. దుబ్బాక భయంతోనే కేసీఆర్ జిల్లాల పర్యటనలకు బయలు దేరాడని ఎద్దేవా చేశారు. గజ్వేల్ ఎమ్మెల్యేను దుబ్బాక ఎమ్మెల్యే కూడా తిట్టగలడని చురకలు అంటించారు.
read also : తెలంగాణ ప్రభుత్వంపై తీరుపై ఏపీ మంత్రి ఫైర్ !
Also Read
తమ పీఠాలు కదులుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్పష్టంగా అర్థమవుతోందని.. ఇద్దరు ముఖ్యమంత్రులు ముందుకొస్తే నీటి పంపాలకు తేల్చటానికి కేంద్రం సిద్ధమన్నారు. NREGS నిధులతో రైతు వేదికలు నిర్మించారని… రైతు వేదికలను ఏ ఒక్కరూ విమర్శించలేదన్నారు. రైతు వేదికల్లో కేంద్రం వాటా, రాష్ట్రం వాటా ఎంత ? అని ప్రశ్నించారు. కేంద్రం నిధులతో వైకుంఠదామాల నిర్మాణాలు చేపట్టారని..హరిత హారం కింద ఖర్చు చేసే ప్రతిపైసా కేంద్రం ఇచ్చిందేనన్నారు. చేసిన పనులకు బిల్లులు రాక సర్పంచ్ లు ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఉందని.. రైతు బంధుని ఎవరు వ్యతిరేకించలేదని తెలిపారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
-
SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!